యాహూకు
మరో ఎదురు దెబ్బ తగిలింది. 2013 ఆగస్టులో 100 కోట్ల యూజర్ల అకౌంట్లు
హ్యాక్ అయ్యాయని యాహూ ప్రకటించింది. 50 కోట్ల యూజర్ల అకౌంట్ల డేటా చోరీకి
గురైనట్లు సెప్టెంబరులో యాహూ ప్రకటించింది. ఈ రెండు సంఘటనలు వేర్వేరని
తాజాగా పేర్కొంది. దీంతో యాహూ మరిన్ని కష్టాల్లోకి జారుకుంది. యాహూ చీఫ్
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఓ ప్రకటనలో ‘‘ఈ చోరీకి
సంబంధించిన చొరబాటు ఎలా జరిగిందో గుర్తించలేకపోతున్నాం’’ అని పేర్కొన్నారు.
యూజర్ల పేర్లు, ఈ-మెయిల్ చిరునామాలు, టెలిఫోన్ నంబర్లు, పుట్టిన తేదీలు,
హాష్‌డ్ పాస్‌వర్డ్‌లు, ఇతరులు గుర్తించకుండా గుప్తంగా ఉంచిన
(ఎన్‌క్రిప్టెడ్) లేదా గుప్తంగా ఉంచని ప్రశ్నలు, జవాబులు చోరీకి గురైనట్లు
తెలిపారు.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్
అధికారులు యాహూకు ఈ సమాచారాన్ని అందజేశారు. అనంతరం డేటాను యాహూ బయటి
ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించింది. చెల్లింపుల వివరాలు, ప్లెయిన్
టెక్స్ట్ పాస్‌వర్డ్‌లు చోరీకి గురి కానట్లు కనిపిస్తోందని యాహూ పేర్కొంది.
దీనినిబట్టి ఎండీ5 ఆల్గోరిథమ్ ఇకపై సురక్షితం కాదని వెల్లడవుతోందని, ఎండీ5
హ్యాష్‌లను సులువుగా ఆన్‌లైన్‌లో చూడటానికి వీలవుతోందని, పాస్‌వర్డ్‌లను
తేలిగ్గా తెలుసుకోగలుగుతున్నారని నిపుణులు చెప్తున్నారు.
హ్యాకింగ్‌లో
ప్రభుత్వ ప్రాయోజిత వర్గాల ప్రమేయం ఉండవచ్చునని విశ్వసిస్తున్నట్లు లార్డ్
చెప్పారు. యాహూ ప్రొప్రయిటరీ కోడ్‌ను ఓ హ్యాకర్ తెలుసుకోగలిగినట్లు
తెలిపారు. కుకీలను ఫోర్జరీ చేసేందుకు ఆ కోడ్‌ను ఉపయోగించినట్లు, ఆ కుకీల
ద్వారా అకౌంట్లను పాస్‌వర్డ్ లేకుండానే యాక్సెస్ చేసేందుకు ఉపయోగించినట్లు
వివరించారు. హ్యాకింగ్ ప్రభావం పడిన అకౌంట్లను తాము గుర్తించామని, ఫోర్జరీ
చేసిన కుకీలను పని చేయకుండా చేశామని తెలిపారు.
యాహూను
చాలా కాలం నుంచి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. 50 కోట్ల యూజర్ల
అకౌంట్లు హ్యాక్ అయినట్లు యాహూ సిబ్బందికి 2014లోనే తెలుసునని సమాచారం.
కానీ హ్యాక్‌కు గురైన విషయాన్ని యాహూ ఈ ఏడాది సెప్టెంబరులో మాత్రమే
ప్రకటించింది. యాహూను వెరిజాన్ కొనుగోలు చేస్తోంది. ఒప్పందం కుదిరిన కొన్ని
నెలల వరకు మొదట జరిగిన హ్యాకింగ్ సమాచారాన్ని యాహూ బయటపెట్టలేదు. యాహూను
4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు జూలైలో వెరిజాన్ ఒప్పందం
కుదుర్చుకుంది. రెండుసార్లు హ్యాకింగ్‌కు గురైనట్లు స్వయంగా యాహూ
వెల్లడించడంతో ఇప్పుడు వెరిజాన్ మరోసారి బేరసారాలకు దిగుతోందని సమాచారం. 1
బిలియన్ డాలర్లు డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment