cricket ad

Friday 16 December 2016

ఐటీ దాడుల్లో రూ.2900 కోట్ల పట్టివేత

దేశంలో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలసిందే. నల్లకుబేరులు వీటిని మార్చుకునేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఐటీశాఖ వీటిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనుమానాలు ఉన్న ప్రతిచోట దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికి దేశ వ్యాప్తంగా 586 చోట్ల దాడులు నిర్వహించి రూ.2,900 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 79 కోట్లు విలువగల రూ.2000 నోట్లు ఉన్నాయని, రూ.2,600 కోట్లు లెక్కల్లో లేని నగదు అని వివరించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చెన్నైలో నిర్వహించిన ఒక్క తనిఖీలోనే రూ.100కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
దిల్లీలోని ఓ లాయర్‌ ఇంట్లో రూ.14కోట్లు స్వాధీనం చేసుకోగా ఆయన అకౌంట్‌ నుంచి రూ.19కోట్లు సీజ్‌చేశారు. మహారాష్ట్రలోని పుణె బ్యాంక్‌లో ఒకే వ్యక్తికి సంబంధించిన 15 లాకర్లలో రూ.9.58 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 8కోట్ల విలువైన కొత్త రూ.2000 నోట్లు కాగా మిగతావి 100 నోట్లని అధికారులు చెప్పారు.

గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ విడుదల

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రచార చిత్రం విడుదల శుక్రవారం సాయంత్రం కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా జరిగింది. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ.. ‘మైక్‌ పట్టుకుంటే ఈ సినిమా గురించి చెప్పకుండా ఆగలేం. ఈ ట్రైలర్‌ చూడాలి. 100వ చిత్రాన్ని ఈ యూనిట్‌లో ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. కోటి రతనాల వీణ తెలంగాణ. ఇక్కడి కోటిలింగాల సాక్షిగా నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం’ అని అన్నారు.

మారిన్‌పై ప్రతీకారం తీర్చుకొన్న సింధు సూపర్‌సిరీస్‌ ఫైనల్స్‌ సెమీస్‌కు అర్హత

భారత అగ్రశ్రేణి షట్లర్‌, తెలుగుతేజం పీవీ సింధు బీడబ్లూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రపంచ నెంబర్‌ వన్‌, సాంకేతికంగా అత్యంత మెరుగైన కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)పై ఒలింపిక్స్‌ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకొంది. గ్రూప్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో 21-17, 21-13తో వరుస గేముల్లో మారిన్‌ను చిత్తు చేసింది.
మ్యాచ్‌ ప్రారంభం నుంచి దూకుడు కనబరిచిన సింధు కళ్లు చెదిరే స్మాష్‌లు, క్రాస్‌కోర్టు షాట్లు, హాఫ్‌ వ్యాలీలతో మారిన్‌ను కోర్టులో అటు ఇటు తిప్పింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశాలు ఇవ్వకుండా రెండు గేముల్లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. అనవసర తప్పిదాల జోలికి పోలేదు. సెమీస్‌లో సింధు దక్షిణ కొరియా షట్లర్‌ జి హ్యూన్‌ సుంగ్‌తో తలపడనుంది. గ్రూప్‌-బిలో సున్‌యూ 3, సింధు 2 పాయింట్లతో 1, 2 స్థానాల్లో నిలిచారు.

నల్లధనం వెల్లడికి మరో అవకాశం రేపట్నుంచే గరీబ్‌ కల్యాణ్‌ యోజన

దిల్లీ: నల్లధనం వెల్లడించేందుకు నల్లకుబేరులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రేపట్నుంచి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనను అమలుచేస్తున్నట్లు రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా శుక్రవారం వెల్లడించారు. 2017 మార్చి 31 వరకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన కొనసాగుతుందన్నారు. ఈ నెల 31లోపు ముందస్తు ఆదాయం ప్రకటించిన వారు ఈ పథకం కిందకు వస్తారని స్పష్టంచేశారు. ఆస్తులు ప్రకటించకుండా దాడుల్లో పట్టుబడితే మాత్రం తీవ్రంగా వ్యవహరించనున్నట్టు ఆయన హెచ్చరించారు. ఆధార్‌, పాన్‌ నంబర్ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. నల్లధనం మార్చుతున్నవారి సమాచారం ఉంటే ఈ మెయిల్‌ blackmoneyinfo@incometax.gov.in ద్వారా తెలపవచ్చని ఆయన సూచించారు. అయితే ఆదాయం వెల్లడించేవారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతామన్నారు.

Thursday 15 December 2016

బ్రేకింగ్ న్యూస్‌.. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్‌ని చిత‌క‌బాదిన జ‌నాలు…!

బ్రేకింగ్ న్యూస్‌.. ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జీత్ ప‌టేల్‌ని చిత‌క‌బాదార‌ట. అక్క‌డో ఇక్క‌డో కాదు.. ఆయ‌న స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లోని ఓ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయ‌న‌పై జ‌నాలు చేయి చేసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంత‌లోనే భ‌ద్ర‌తా సిబ్బంది వ‌చ్చి అడ్డుకోవ‌డంతో ఉర్జీత్ ప‌టేల్ త‌ప్పించుకున్నార‌ట‌. ఇందులో నిజ‌మెంతో తెలియ‌దు కానీ, మీడియాలో మాత్రం ఇది నిజ‌మేన‌ని న్యూస్ చ‌క్క‌ర్లు కొడుతోంది.
పాత పెద్ద నోట్లు ర‌ద్దు చేసి దాదాపు 40రోజులు కావొస్తోంది. ఇంత‌వ‌రకు జ‌నాల క‌ష్టాలు ఏమాత్రం తీర‌లేదు. రోజూ గంట‌ల త‌ర‌బ‌డి ఏటీఎమ్‌, బ్యాంక్‌ల ముందు క్యూలు క‌డుతున్నారు. వారి వెత‌లు పెర‌గ‌డ‌మే కానీ, త‌గ్గ‌లేదు. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో కాస్త ప‌ర్లేదు… గ్రామీణ ప్రాంతాల‌లో అయితే జ‌నాల స‌మ‌స్య‌లు చెప్పినా తీరేలా లేవు. అందుకే, వారిలో అస‌హ‌నం, అసంతృప్తి, ఆగ్ర‌హం పెరుగుతోంది. మ‌రోవైపు, జ‌నాలు ఇంత‌గా క‌ష్ట‌ప‌డుతున్నా.. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ ఉర్జీత్ ప‌టేల్ ఏనాడూ ఈ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌లేదు. ఇన్ని స‌మ‌స్య‌ల‌తో జ‌నాలు క‌ష్ట‌ప‌డుతున్నా.. వారి భావోద్వేగాల‌ను అణిచివేసే ప్ర‌య‌త్నం చెయ్య‌లేదు ఉర్జీత్ ప‌టేల్‌.
ఓవైపు, పాత నోట్ల ర‌ద్దు ఆలోచ‌న అంతా ఉర్జీత్‌దేన‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యాన్ని ముందుగా రిల‌య‌న్స్ అంబానీ, అదానీ వంటి బ‌డా వ్యాపార‌వేత్త‌లకు లీక్ చేసి సామాన్యుల‌ను మాత్రం రోడ్డున ప‌డేశార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. ఇలా, ఉర్జీత్ ప‌టేల్‌పై జ‌నాల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. అందుకే, ఆయ‌న సింగిల్‌గా క‌నిపించ‌డంతో ఎయిర్‌పోర్ట్‌లోనే చిత‌క బాదిన‌ట్లు తెలుస్తోంది. ఇది నిజ‌మా..? అబ‌ద్ధ‌మా..? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

బన్నీ టాప్ కానేకాదు ఎన్టీఆరే.. సోషల్ మీడియాలో భలే ఫైట్!

అవును నిజంగానే.. ఫైట్ జరుగుతోంది. ఈ హీరోల గురించి ఈ గొడవలేంటి అనుకున్నా.. ఇది మాత్రం జరుగుతూనే ఉంది. తాజాగా, ఈ ఏడాది టాప్ హీరో బన్నీ అని అల్లు అర్జున్ అభిమానులు, కాదు కాదు ఎన్టీఆరే టాప్ హీరో అని జూనియర్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ‘మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోస్ 2016’ అంటూ గూగుల్ ఇటీవల ఒక జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితా తెలుగు సినీ అభిమానులను గందరగోళంలో పడేసింది. ఆ జాబితా ఆధారంగా మోస్ట్ సెర్చ్‌డ్ హీరో బన్నీ అని కొందరంటే, కాదు కాదు ఎన్టీఆర్ అని కొందరంటున్నారు. దీనికి కారణం గూగుల్‌లో ఎన్టీఆర్‌ను రెండు రకాల పేర్లతో సెర్చ్ చేస్తుండడమే. జూనియర్‌ను సెర్చ్ చేసే రెండు కీవర్డ్‌ల ఆధారంగా రెండు జాబితాలు సిద్ధం చేశారు అభిమానులు. జూనియర్ ఎన్టీ రామారావు పేరుతో కూడిన జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉంటే, ఎన్టీఆర్ అనే కీవర్డ్ పేరుతో కూడిన జాబితాలో జూనియర్ ముందున్నాడు. దీంతో తమ హీరో టాప్ అంటే, తమ హీరో టాప్ అంటూ సోషల్ మీడియాలో యుద్ధమే చేసుకుంటున్నారు ఎన్టీఆర్, బన్నీ అభిమానులు. కాగా, రెండు జాబితాల్లోనూ మహేశ్, ప్రభాస్, పవన్‌లు వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పాప s3x కి బానిస అవ్వటం ఏంటి అనుకుంటున్నారా?? నిజమే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబుకు మరదలుగా నటించిన తేజస్వి గుర్తుందా?

తెలుగు న్యూస్ ఛానళ్లకు సంబంధించి దిగ్బ్రాంతికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. నిత్యం నీతులు చెప్పే టీవీ ఛానళ్లు డబ్బు కోసం అడ్డదారి తొక్కడం పై ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి 1000 కోట్ల ప్రకటనలు మీడియా సంస్థలకు అందుతున్నాయి. వీటిని అందిపుచ్చుకునేందుకు పలు టీవీ ఛానళ్లు లంచాలు ఎరవేసిన విషయం వెలుగులోకి వచ్చింది. టీవీ ఛానళ్ల పనితీరు, ప్రేక్షకుల ఫాలోయింగ్‌పై బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రేటింగ్ ఇస్తుంటుంది. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ఇళ్లలో రేటింగ్ మీటర్ బాక్స్‌లను అమరుస్తుంది. ఇక్కడే తెలుగు టీవీ ఛానళ్లు అడ్డదారి తొక్కాయి.
రేటింగ్ మీటర్లు అమర్చబడిన ఇళ్లను గుర్తించి సదరు ఇంటి కుటుంబసభ్యులకు నెలనెల డబ్బు చెల్లించి ప్రతి రోజు కనీసం రెండు నుంచి నాలుగు గంటల పాటు తమ ఛానళ్లు నిరంతరంగా ట్యూన్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా రోజుకు రెండు గంటల పాటు ఒక ఛానల్‌ను ట్యూన్ చేసి పెడితే సదరు ఇంటికి రెండు వేలు ఇస్తున్నాయి సదరు ఛానళ్లు. కొద్దిరోజుల క్రితమే ఇలాంటి మోసానికి పాల్పడ్డారంటూ టీవీ9, వీ6 ఛానళ్లను రేటింగ్ నుంచి బార్క్ నిషేధించింది. అయితే ఆ రెండు ఛానళ్లే కాకుండా టీవీ5, ఎన్‌టీవీ, స్డూడియో ఎన్‌, జెమిని, ఏబీఎన్‌ ఛానళ్లు కూడా ఇలా రేటింగ్ మీటర్లు ఉన్న ఇళ్లకు లంచాలు ఇచ్చినట్టు ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.
రోజూ రెండు గంటల పాటు ఛానల్‌ చూసినందుకు ఎన్‌టీవీ, గంట పాటు చూస్తున్నందుకు ఏబీఎన్‌ వాళ్లు డబ్బు చెల్లిస్తున్నారని ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎస్‌కే బాబా చెప్పారు. అతడి ఇంటిలో బార్క్‌ వారి రేటింగ్ మీటర్ ఉంది. అతడు చెప్పే మాటలు స్టింగ్ ఆపరేషన్‌లో రికార్డు అయ్యాయి.
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సారయ్య అనే వ్యక్తి తమకు ఎన్‌టీవీ రెండు వేలు ఇస్తున్నట్టు చెప్పారు. ఇందు కోసం రోజూ నాలుగు గంటల పాటు ఎన్‌టీవీని ట్యూన్ చేసి ఉంచుతామన్నారు. క్రాంతి అనే వ్యక్తి బాక్స్‌ను అమర్చారని తొలుత ఎన్‌టీవీని తెచ్చిన అతడు, తర్వాత స్డూడియో ఎన్‌, ఏబీఎన్‌లను కూడా తెచ్చారని సారయ్య చెప్పారు. ఇలా దాదాపు 40 చోట్ల స్టింగ్ ఆపరేషన్ చేసింది సదరు మీడియా సంస్థ.
ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో ఎక్కువగా టీవీ5, ఎన్‌టీవీ, స్డూడియో ఎన్‌, ఏబీఎన్, జెమిని ఛానళ్ల పేర్లు వినిపించాయి. టీవీ9 కూడా డబ్బు చెల్లిస్తున్నట్టు స్టింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైంది. దీనిపై బార్క్ ఎలా స్పందిస్తుందో. ఈ స్టింగ్‌ ఆపరేషన్లను పరిగణలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో టాప్ న్యూస్ ఛానళ్లుగా చలామణి అవుతున్న ఛానళ్లు చాలా ఏళ్లుగా మోసాలు చేస్తూ బతుకుతున్నట్టు స్పష్టమవుతోంది.