బ్రేకింగ్ న్యూస్.. ఆర్‌బీఐ గవర్నర్
ఉర్జీత్ పటేల్‌ని చితకబాదారట. అక్కడో ఇక్కడో కాదు.. ఆయన
స్వరాష్ట్రం గుజరాత్‌లోని ఓ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆయనపై జనాలు చేయి
చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతలోనే భద్రతా సిబ్బంది వచ్చి
అడ్డుకోవడంతో ఉర్జీత్ పటేల్ తప్పించుకున్నారట. ఇందులో నిజమెంతో
తెలియదు కానీ, మీడియాలో మాత్రం ఇది నిజమేనని న్యూస్ చక్కర్లు
కొడుతోంది.
పాత పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపు 40రోజులు కావొస్తోంది. ఇంతవరకు
జనాల కష్టాలు ఏమాత్రం తీరలేదు. రోజూ గంటల తరబడి ఏటీఎమ్, బ్యాంక్‌ల
ముందు క్యూలు కడుతున్నారు. వారి వెతలు పెరగడమే కానీ, తగ్గలేదు.
పట్టణ ప్రాంతాలలో కాస్త పర్లేదు… గ్రామీణ ప్రాంతాలలో అయితే జనాల
సమస్యలు చెప్పినా తీరేలా లేవు. అందుకే, వారిలో అసహనం, అసంతృప్తి,
ఆగ్రహం పెరుగుతోంది. మరోవైపు, జనాలు ఇంతగా కష్టపడుతున్నా.. ఆర్బీఐ
గవర్నర్ ఉర్జీత్ పటేల్ ఏనాడూ ఈ సమస్యలపై మాట్లాడలేదు. ఇన్ని
సమస్యలతో జనాలు కష్టపడుతున్నా.. వారి భావోద్వేగాలను అణిచివేసే
ప్రయత్నం చెయ్యలేదు ఉర్జీత్ పటేల్.
ఓవైపు, పాత నోట్ల రద్దు ఆలోచన అంతా ఉర్జీత్‌దేనని ప్రచారం జరిగింది. ఈ
విషయాన్ని ముందుగా రిలయన్స్ అంబానీ, అదానీ వంటి బడా వ్యాపారవేత్తలకు
లీక్ చేసి సామాన్యులను మాత్రం రోడ్డున పడేశారని మీడియాలో వార్తలు
వచ్చాయి. ఇలా, ఉర్జీత్ పటేల్‌పై జనాల్లో ఆగ్రహం కట్టలు
తెంచుకుంటోంది. అందుకే, ఆయన సింగిల్‌గా కనిపించడంతో ఎయిర్‌పోర్ట్‌లోనే
చితక బాదినట్లు తెలుస్తోంది. ఇది నిజమా..? అబద్ధమా..? అనేది
ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment