cricket ad

Thursday, 15 December 2016

బన్నీ టాప్ కానేకాదు ఎన్టీఆరే.. సోషల్ మీడియాలో భలే ఫైట్!

అవును నిజంగానే.. ఫైట్ జరుగుతోంది. ఈ హీరోల గురించి ఈ గొడవలేంటి అనుకున్నా.. ఇది మాత్రం జరుగుతూనే ఉంది. తాజాగా, ఈ ఏడాది టాప్ హీరో బన్నీ అని అల్లు అర్జున్ అభిమానులు, కాదు కాదు ఎన్టీఆరే టాప్ హీరో అని జూనియర్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఈ ఏడాది ‘మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ హీరోస్ 2016’ అంటూ గూగుల్ ఇటీవల ఒక జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితా తెలుగు సినీ అభిమానులను గందరగోళంలో పడేసింది. ఆ జాబితా ఆధారంగా మోస్ట్ సెర్చ్‌డ్ హీరో బన్నీ అని కొందరంటే, కాదు కాదు ఎన్టీఆర్ అని కొందరంటున్నారు. దీనికి కారణం గూగుల్‌లో ఎన్టీఆర్‌ను రెండు రకాల పేర్లతో సెర్చ్ చేస్తుండడమే. జూనియర్‌ను సెర్చ్ చేసే రెండు కీవర్డ్‌ల ఆధారంగా రెండు జాబితాలు సిద్ధం చేశారు అభిమానులు. జూనియర్ ఎన్టీ రామారావు పేరుతో కూడిన జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉంటే, ఎన్టీఆర్ అనే కీవర్డ్ పేరుతో కూడిన జాబితాలో జూనియర్ ముందున్నాడు. దీంతో తమ హీరో టాప్ అంటే, తమ హీరో టాప్ అంటూ సోషల్ మీడియాలో యుద్ధమే చేసుకుంటున్నారు ఎన్టీఆర్, బన్నీ అభిమానులు. కాగా, రెండు జాబితాల్లోనూ మహేశ్, ప్రభాస్, పవన్‌లు వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు.

No comments:

Post a Comment