cricket ad

Friday, 16 December 2016

నల్లధనం వెల్లడికి మరో అవకాశం రేపట్నుంచే గరీబ్‌ కల్యాణ్‌ యోజన

దిల్లీ: నల్లధనం వెల్లడించేందుకు నల్లకుబేరులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రేపట్నుంచి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనను అమలుచేస్తున్నట్లు రెవెన్యూశాఖ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా శుక్రవారం వెల్లడించారు. 2017 మార్చి 31 వరకు గరీబ్‌ కల్యాణ్‌ యోజన కొనసాగుతుందన్నారు. ఈ నెల 31లోపు ముందస్తు ఆదాయం ప్రకటించిన వారు ఈ పథకం కిందకు వస్తారని స్పష్టంచేశారు. ఆస్తులు ప్రకటించకుండా దాడుల్లో పట్టుబడితే మాత్రం తీవ్రంగా వ్యవహరించనున్నట్టు ఆయన హెచ్చరించారు. ఆధార్‌, పాన్‌ నంబర్ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. నల్లధనం మార్చుతున్నవారి సమాచారం ఉంటే ఈ మెయిల్‌ blackmoneyinfo@incometax.gov.in ద్వారా తెలపవచ్చని ఆయన సూచించారు. అయితే ఆదాయం వెల్లడించేవారి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతామన్నారు.

No comments:

Post a Comment