దేశంలో
ఉన్న నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు
చేసిన విషయం తెలసిందే. నల్లకుబేరులు వీటిని మార్చుకునేందుకు పలు
మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఐటీశాఖ వీటిని తిప్పికొట్టేందుకు
ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అనుమానాలు ఉన్న ప్రతిచోట దాడులు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికి దేశ వ్యాప్తంగా 586 చోట్ల దాడులు నిర్వహించి రూ.2,900
కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో
79 కోట్లు విలువగల రూ.2000 నోట్లు ఉన్నాయని, రూ.2,600 కోట్లు లెక్కల్లో లేని
నగదు అని వివరించారు. తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నగదును
స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చెన్నైలో నిర్వహించిన ఒక్క తనిఖీలోనే
రూ.100కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
దిల్లీలోని ఓ లాయర్ ఇంట్లో రూ.14కోట్లు స్వాధీనం చేసుకోగా ఆయన అకౌంట్ నుంచి రూ.19కోట్లు సీజ్‌చేశారు. మహారాష్ట్రలోని పుణె బ్యాంక్‌లో ఒకే వ్యక్తికి సంబంధించిన 15 లాకర్లలో రూ.9.58 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 8కోట్ల విలువైన కొత్త రూ.2000 నోట్లు కాగా మిగతావి 100 నోట్లని అధికారులు చెప్పారు.

No comments:
Post a Comment