cricket ad

Friday, 16 December 2016

మారిన్‌పై ప్రతీకారం తీర్చుకొన్న సింధు సూపర్‌సిరీస్‌ ఫైనల్స్‌ సెమీస్‌కు అర్హత

భారత అగ్రశ్రేణి షట్లర్‌, తెలుగుతేజం పీవీ సింధు బీడబ్లూఎఫ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రపంచ నెంబర్‌ వన్‌, సాంకేతికంగా అత్యంత మెరుగైన కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)పై ఒలింపిక్స్‌ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకొంది. గ్రూప్‌-బిలో భాగంగా శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో 21-17, 21-13తో వరుస గేముల్లో మారిన్‌ను చిత్తు చేసింది.
మ్యాచ్‌ ప్రారంభం నుంచి దూకుడు కనబరిచిన సింధు కళ్లు చెదిరే స్మాష్‌లు, క్రాస్‌కోర్టు షాట్లు, హాఫ్‌ వ్యాలీలతో మారిన్‌ను కోర్టులో అటు ఇటు తిప్పింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశాలు ఇవ్వకుండా రెండు గేముల్లోనూ ఆధిక్యం ప్రదర్శించింది. అనవసర తప్పిదాల జోలికి పోలేదు. సెమీస్‌లో సింధు దక్షిణ కొరియా షట్లర్‌ జి హ్యూన్‌ సుంగ్‌తో తలపడనుంది. గ్రూప్‌-బిలో సున్‌యూ 3, సింధు 2 పాయింట్లతో 1, 2 స్థానాల్లో నిలిచారు.

No comments:

Post a Comment