cricket ad

Saturday 10 December 2016

వారసత్వ పోరాటం!


  • జయ ఆస్తుల కోసం మోహరింపు
  • ఒక వర్గం శశికళ వైపు, మరోవర్గం వ్యతిరేకం
చెన్నై, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం! పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోరాటం! జయలలిత ఆస్తుల కోసం పోరాటం! ఈ మూడూ తనకే దక్కాలంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి పదవులకు సంబంధించి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. తాజాగా, జయలలిత ఆస్తుల వారసత్వం కూడా తమిళనాట రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్ట ప్రకారం, రక్త సంబంధీకులెవరైనా ఉంటే జయ ఆస్తులు వారికే చెందుతాయి. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జయ ఆస్తులపై పట్టు సాధించిన శశికళ.. ఆమె బంధువుల మధ్య చీలికలు తెచ్చేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
జయ రక్త సంబంధీకులెవరు?
జయలలిత పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే, ఎన.రాగచార్‌ కుమారుడు జయరాం. బెంగళూరులో ఆయన న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆయన మొదటి భార్య జయమ్మ. ఈ దంపతులకు కలిగిన సంతానం వాసుదేవన. ప్రస్తుతం ఆయన తన భార్యాబిడ్డలతో మైసూరులోనే ఉంటున్నారు. జయమ్మ కన్నుమూయడంతో జయరాం వేదవల్లి అలియాస్‌ సంధ్యను వివాహం చేసుకున్నారు. అప్పటికి జయలలిత వయసు రెండేళ్లు. అనంతరం, జయరాం, వేదవల్లి దంపతులకు జయకుమార్‌ జన్మించాడు. ఈ జయకుమార్‌ 1995లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జయకుమార్‌కు దీపక్‌, దీప అనే ఇద్దరు సంతానం. దీపక్‌ శశికళతో కలిసి జయ అంతిమ సంస్కారాల్లో పాల్గొనగా, దీపను మాత్రం దరి చేరనీయలేదు. ఇలా చూస్తే జయ రక్త సంబంధీకులు దీపక్‌, దీప మాత్రమే. కాగా, దీపక్‌ శశికళ బృందంవైపు చేరినట్లు తెలుస్తోంది. దీప తన మేనత్త వద్దకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోయెస్‌ గార్డెనలో జయ మృతదేహానికి స్నానాదులు చేయించేటప్పుడు దీపను కూడా పిలవాలని కొందరు సీనియర్లు చెప్పినా, శశికళ బృందం నిరాకరించింది. రాజాజీ హాలు వద్ద జయ మృతదేహం ఉన్నప్పుడు అక్కడికొచ్చిన దీపను క్షణాల్లోనే పంపేశారు. జయ మృతదేహాన్ని తీసుకెళ్లే సైనిక శకటం ఎక్కేందుకు దీప చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే, దీపక్‌ను మాత్రం శశికళ భర్త నటరాజన తన వెంటే ఉంచుకున్నారు. ఉదయం నుంచీ తన వెంటే ఉంచుకున్న నటరాజన.. కనీసం బయటకు కూడా వెళ్లనీయలేదని సమాచారం. అలాగే, ఆయనకు అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకూ అవకాశం ఇచ్చారు. దీంతో, దీపక్‌తో శశికళ బృందం టచలో ఉందని, అతన్ని దరి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. దీపను మాత్రం దరి చేరనిచ్చేది లేదని శశికళ కరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. రక్త సంబంధీకులకే ఆస్తిపాస్తులు దక్కే అవకాశం ఉన్నందున, ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దీపక్‌ను ప్రయోగించవచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. పోయెస్‌ గార్డెన ఆదిలో జయ మాతృమూర్తి సంధ్య పేరుపై ఉండేది. అనంతర కాలంలో జయకు వారసత్వంగా వచ్చింది. అంటే ఆ ఇల్లు దీపక్‌ నాయనమ్మది అవుతుంది. చట్ట ప్రకారం ఆ భవనానికి పూర్తి వారసుడు అతనే అవుతాడు. గతంలో ఎంజీఆర్‌ రాసిన వీలునామా వల్ల ఆయన ఆస్తులన్నీ తొలిగా న్యాయవాది ఎనసీ రాఘవాచారి పర్యవేక్షించారు. అనంతరం ఎంజీఆర్‌ బంధువైన రాజేంద్రన ఆధీనంలోకి వెళ్లాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రస్తుతం అవి మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షణలో ఉన్నాయి. అయితే, ఇలాంటివేవీ జరగకుండా దీపక్‌ను ప్రయోగించేందుకు శశికళ బృందం వ్యూహం రచిస్తోంది.

ఈ-పేమెంట్స్ పై ఆఫర్స్ ప్రకటించిన కేంద్రం!

డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది కేంద్రం. డిజిటల్  చెల్లింపులు చేసేవాళ్లకు వరాలు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ రాయితీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు 20 నుంచి 40 శాతం పెరిగిందన్నారాయన. నగదు రహిత దేశంగా భారత్ ను నడిపించాలన్న సంకల్పంతో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు జైట్లీ.
అరుణ్ జైట్లీ ప్రకటించిన ఆఫర్స్..
… 10 వేలలోపు జనాభా ఉన్న.. ఒక లక్ష గ్రామాలకు రెండు పీవోఎస్ లు  ఉచితం
… ఆన్ లైన్ ద్వారా రైల్వే టికెట్లు కొనుగోలు చేసే వాళ్లకు 10 లక్షల భీమా
… డిజిటల్ మోడ్ లొ పెట్రోల్, డీజిల్ కొనేవాళ్లకు 0.75 శాతం తగ్గుతుంది
… కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 4.32 కోట్ల జనాభాకు నాబార్డ్ ద్వారా రూపే కార్డులు జారీ
… రెండువేల(రూ. 2000) వరకు డిజిటల్ చెల్లింపులు చేసేవాళ్లకు సర్వీస్ ట్యాక్స్ రద్దు
… టోల్ ప్లాజాలలో రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్
… ఆన్ లైన్ లో రైల్వే టికెట్లు కొన్నవాళ్లకు అకామిడేషన్, క్యాటరింగ్, రిటైరింగ్ రూమ్స్ ల ఛార్జీలో 5 శాతం రాయితీ
… సబర్బన్ రైళ్లలో మంత్లీ  సీజనల్ టికెట్లు కొనుగోలు చేసే వారికి 0.5 శాతం రాయితీ  
… ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్ లైన్ లో చెల్లింపులు చేస్తే 10 శాతం రాయితీ
… జాతీయ బ్యాంకులు పీవోఎస్ లను రెంటుకు ఇచ్చిన వ్యాపారుల నుంచి నెలకు రూ. 100 కంటే ఎక్కువ అద్దె తీసుకోవద్దు

జయలలిత సమాధి నుండి శబ్ధాలు.! ఇదిగో కారణాలు.!!

జయలలిత సమాధిని దర్శించుకోడానికి వచ్చిన అమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మ సమాధి మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయంలో…..సమాధి లోపలి నుండి శబ్ధాలు వినిపిస్తున్నాయని తెలియడంతో…అమ్మ అభిమానులు ఆ శబ్దాలు వినడానికి  మెరినా బీచ్ సమీపం లో ఉన్న  అమ్మ సమాధిని దర్శించుకోడానికి క్యూలు కడుతున్నారు. అయితే ఇవి జయలలిత చేతికున్న గడియారం నుండి వచ్చే టుక్ ,టుక్ అనే శబ్దాలు. జయలలితన పార్థీవ దేహాన్ని పూడ్చే సమయంలో ఆమె చేతికున్న గడియారాన్ని అలాగే ఉంచి పూడ్చారు. అందుకే సమాధి నుండి ఆ శబ్దాలు వస్తున్నాయి.

 జయకు రిస్ట్ వాచ్ లంటే చాలా ఇష్టం… ఇమె దగ్గర దాదాపు అన్ని బ్రాండ్ లకు చెందిన రిస్ట్ వాచ్ లు ఉన్నాయి. అంత ఇష్టంగా చేతికి పెట్టుకున్న గడియారాన్ని అలాగే జయ చేతికి ఉంచే సమాధి చేయడంతో…ఇప్పుడు సమాధి నుండి ఆ శబ్దాలు వస్తున్నాయి. ఇక మెరీన బీచ్ లో జయ సమాధికి 20 అడుగుల దూరంలోనే ఉన్న తమిళనాడు మాజీ CM, జయ రాజకీయ గురువు MJR సమాధి నుండి కూడా ఇదే తరహాలో గడియారం చప్పుడు రావడం విశేషం.

Friday 9 December 2016

నమో... వేంకటేశాయ

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం కోసం దాదాపుగా 25 సెట్లను నిర్మించారు. రామోజీ ఫిలింసిటీలో తీర్చిదిద్దిన తిరుమల సెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. నాగార్జున హాథీరామ్‌ బాబాగా కనిపిస్తారు. వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌ జైన్‌, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటించారు. విమలారామన్‌, రావురమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి

నచ్చితేనే చేస్తా... నచ్చితేనే చూస్తా!

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. దాదాపు తొమ్మిదేళ్ల తరవాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. అందుకే చిరు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెరపై చిరు ఎలా కనిపిస్తాడు? ఎలాంటి డైలాగులు చెబుతాడు? అనే ఉత్కంఠే అందరిలోనూ. దానికి తెర దించుతూ ‘ఖైదీ నంబర్‌150’ టీజర్‌ వచ్చేసింది. గురువారం సాయింత్రం చిరు టీజర్‌ని ఆన్‌లైన్‌లో వదిలారు. ‘నాకేదైనా నచ్చితేనే చేస్తా... నచ్చితేనే చూస్తా’ అంటూ ఓ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు చిరు. రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చిత్రంలోని పాటల్ని విజయవాడలో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

ఫేస్‌బుక్‌లో తొలి స్థానం ఈ పండగదేనట!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారందరికీ అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమం. ఆనందంగా గడిపిన క్షణాలనైనా, ఒక భావాన్నైనా దీని ద్వారానే నలుగురితో పంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల వివిధ అంశాలపై చర్చలకూ ఫేస్‌బుక్‌ వేదికవుతోంది. అయితే, ఈ ఏడాది మన దేశంలో ఎక్కువమంది దేని గురించి మాట్లాడారో తెలుసా? దీపావళి. అవును.. దేశవ్యాప్తంగా జరుపుకొనే ఈ పండగ గురించే ఈ ఏడాది ఎక్కువమంది చర్చించినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. మన దేశంతో పాటు అంతర్జాతీయంగా చర్చకు వచ్చిన తొలి పది అంశాల జాబితాను ‘ఫేస్‌బుక్‌ 2016 రివ్యూ’ పేరిట గురువారం విడుదల చేసింది.
మన దేశానికి సంబంధించి చర్చించిన అంశాల్లో దీపావళి తొలిస్థానంలో నిలవగా.. క్రికెట్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడోస్థానంలో.. ఉరీ ఉగ్రదాడి, దానికి కొనసాగింపుగా పాక్‌పై మన సైన్యం జరిపిన మెరుపుదాడులపై ఎక్కువగా చర్చించారట. దీంతో పాటు ధోనీ చిత్రం, ప్రముఖ డీజే హార్డ్‌వెల్‌ ఇండియా పర్యటన, ప్రియాంక చోప్రా, రియో ఒలింపిక్స్‌, పోకెమాన్‌గో, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, ఐఫోన్‌ 7 లాంచ్‌ గురించి చర్చించారని ఫేస్‌బుక్‌ తెలిపింది.
ఇక అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎక్కువమంది చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ రాజకీయాలు, పోకెమాన్‌గో రియాలిటీ గేమ్‌ చర్చకు వచ్చాయి. వీటితోపాటు ఒలింపిక్స్‌, బ్రెగ్జిట్‌ అంశాలు టాప్‌ 10లో చోటు సాధించాయి.
మొబైల్‌ వినియోగమే అధికం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫేస్‌బుక్‌కు దేశవ్యాప్తంగా నెలవారీ 16.6కోట్ల(166 మిలియన్ల) మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. దీనిలో 15.9కోట్ల (159 మిలియన్ల) మంది మొబైల్‌ ద్వారానే ఫేస్‌బుక్‌ వాడుతున్నారు. ఇక రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 8.5కోట్లు (85మిలియన్లు)కాగా.. మొబైల్‌లో 8.1కోట్ల(81మిలియన్ల) మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.

Tuesday 6 December 2016

మోదీ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు…
నీతులు ఉన్నది బహిరంగసభల్లో ధీర్ఘాలు తీసి వెర్రిజనాలకు చెప్పేందుకేనని బీజేపీ నేతలు మరోసారి నిరూపించారు. దేశంలో జనం రెండు వేల రూపాయల కోసం పడరాని పాట్లు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం ఆడంబరాల్లో మునిగితేలుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌, బీజేపీ నేత గాలి జనార్దన్‌ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు నోట్ల రద్దు తర్వాతే కోట్లు తగలేసి ఘనంగా వారింట వివాహాలు చేసుకున్నారు. దీనిపై దేశం మొత్తం నిరసన తెలిపినా బీజేపీ నేతలకు బుద్ధి రాలేదు. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తన కూతురి వివాహం ఆదివారం రాత్రి చేశారు.
ఆ పెళ్లిని చూసిన వారు షాక్ అవుతున్నారు. దేశం కరెన్సీ కరువుతో అల్లాడుతున్న వేళ గడ్కరీ ఏకంగా 50 ప్రత్యేక చార్టర్డ్ విమానాలను వివాహానికి వచ్చే అథితుల కోసం వాడారు. పది వేల మంది అతిథులు వచ్చిన ఈ వివాహానికి దాదాపు 120 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఈ వివాహానికి కేంద్రమంత్రులు కూడా హాజరవడం విశేషం. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, నీతులు చెబుతున్న అమిత్‌షా, వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ వివాహం నాగపూర్‌లో జరిగింది. ఈ వివాహం గురించి తెలుసుకున్న నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. నోట్ల రద్దు చేసి సామాన్యులపై పడి ఏడుస్తున్న మోదీ ప్రభుత్వం ఇలా కోట్లు తగలేసి కేంద్రమంత్రులే చేస్తున్న వివాహలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏం కష్టం చేసి సంపాదించి తన కేబినెట్ మంత్రి గడ్కరీ వంద కోట్లు పెట్టి కూతురు వివాహం చేశారో దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. చూస్తుంటే మోదీ తీరు ఇంట గెలవలేక రచ్చ గెలిచి రచ్చ చేసేందుకు బయలుదేరినట్టుగా ఉందంటున్నారు