సంక్షోభం
ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచుకోవాలి అనేది చంద్రబాబు ఫిలాసఫీ . ఎందుకంటే
ప్రజలందరూ ఒక సంక్షోభంలో ఉంటే ఆసమయంలో మిగతా విషయాలు ఏవీ కూడా పట్టించుకోరు
, అదే అదునుగా ప్రజల కన్నుగప్పి ఎవరికీ అనుమానం రాకుండా మిగతా రంగాలలో
దోచుకోవటం అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య . దీనిలో చిన్నప్పటి
నుండీ ఆరితేరి ఉన్నాడు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వం తీసుకొన్న అతిపెద్ద
సాహసోపేత నిర్ణయం ఏదయినా ఉందంటే అది నోట్ల రద్దు వ్యవహారమే . మొదట్లో మోడీ
చెప్పినట్లు ఇది అంత్యంత రహస్యమైన నిర్ణయం ఎంతమాత్రం కాదు , ఈరోజు బయటకి
వస్తున్న కొత్త సంగతులు ప్రకారం ఇలాంటి నిర్ణయం మోడీ తీసుకోబోతున్నట్లు
బీజేపీకి , పారిశ్రామికవేత్తలకి , nda మిత్రపక్షాలందరికి తెలుసు , అందుకే
వాళ్ళ పార్టీ మనుషులు అందరూ ముందే జాగ్రత్తపడ్డారు .
పెద్దనోట్లు రద్దుచేయమని సరిగ్గా నెలరోజులు ముందు చంద్రబాబు
చెప్పుకొంటున్నట్లు మోడీకి ఉత్తరం వ్రాసినమాట నిజమే . ఎందుకంటే చంద్రబాబుకి
ఈ విషయం చాలా రోజులు ముందే తెలుసు , అప్పటినుండి జాగ్రత్తగా పావులు కదిపి
తన మనుషులుతో రాజధాని చుట్టూ ఎడాపెడా భూములు కొనిపించాడు ( ఈ విధయాలన్ని
మరో పోస్టులో వివరంగా వ్రాస్తాను ) .
భూములు విషయాలు పక్కనపెడితే , నోట్లరద్దు వలన హెరిటేజ్ కి , బిగ్ బజార్
కి తద్వారా చంద్రబాబుకి కలిగిన లబ్ది ఏమిటో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి
.
చంద్రబాబు ముఖ్యమంత్రి కాకమునుపు హెరిటేజ్ విలువ ఎంత ఉంది , ఇప్పుడు
హెరిటేజ్ విలువ ఎంత ఉందో చుస్తే దేశంమొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున లాభాలు
గడించిన సంస్థ ఇంకోటి లేదని తెలుస్తుంది .
ఒక్కసారి గత రెండు సవత్సరాలలోనే హెరిటేజ్ విలువ ఆకాశంలోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి .
1995 లో ప్రారంభమైన హెరిటేజ్ 2011 నవంబర్ వరకు కూడా దాని మొత్తం విలువ
189 కోట్లు .మొన్న ముఖ్యమంత్రి కావటానికి ముందు దానివిలువ 411 కోట్లు .
ముఖ్యమంత్రి అయిన ఒక్క సంవత్సరంలోనే దానివిలువ 1341 కోట్లకు పెరిగింది .
మరొక్క సంవత్సరంలోనే అనగా మొన్న అక్టోబర్ నాటికి దానివిలువ అక్షరాలా 2109
కోట్లు . అనగా దగ్గరదగ్గర ఈ రెండు సవత్సరాలలోనే హెరిటేజ్ విలువ 600 రేట్లు
పెరిగింది .
2012 నుండి ఇప్పటివరకు కంపెనీలో వచ్చిన పెద్ద మార్పేమిలేదు . అవే పాలు
,పెరుగు , మజ్జిగ , కూరగాయలు కాకపొతే లాభాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి
.ఇది ఎలా సాధ్యం అయింది ?
ఎలాంటి దోపిడీని అయినా ఏ చట్టాలకు దొరకకుండా చేయటంలో చంద్రబాబుది
అందెవేసిన చేయి . ఈ రెండు సంవత్సరాలలో దోచుకొన్న డబ్బునంతటిని వైట్ మనీగా
మార్చుకోవటానికి వీళ్ళ మనుషులతోనే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా వీళ్ళ షేర్లు
వీళ్ళే కొన్నట్లు లెక్కలు తారుమారు చేసి 189 కోట్లు విలువఉన్న కంపెనీని
2109 కోట్లకు వీళ్ళే పెంచుకున్నారు . ఆ విధంగా దోచుకొన్న డబ్బునంతా
హెరిటేజ్ లాభాయాలరూపంలోకి మార్చుకున్నారు .
హెరిటేజ్ షేర్లు ఎలా పెరిగాయో తేదీల వారిగా ఈ క్రింద ఫోటోలు గమనించండి .
-- ఫోటో 1 - నవంబర్ 25, 2011 లో హెరిటేజ్ విలువ 81.52 రూపాయలు ( మొత్తం
షేర్లు 23,199,000 ) , అనగా అప్పటి విలువ 189 కోట్ల 11 లక్షలు .
-- ఫోటో 2 - డిసెంబర్ 6,2013 నాటికి హెరిటేజ్ షేరు విలువ 177.45 రూపాయలు , అనగా కంపెనీ మొత్తం విలువ 411 కోట్ల 66 లక్షలు .
-- ఫోటో 3 - జూలై 10,2015 నాటికి షేరు విలువ 400.50 రూపాయలకు కి పెరిగి మొత్తం కంపెనీ విలువ 929 కోట్ల 11 లక్షలకు పెరిగింది .
-- ఫోటో 4 - డిసెంబర్ 18,2015 అనగా మరో నాలుగు నెలల్లోనే షేరు విలువ
578.15 రూపాయలకి పెరిగి మొత్తం కంపెనీ విలువ 1342 కోట్ల కి చేరుకొంది .
-- ఫోటో 5 - అక్టోబర్ 28 , 2016 నాటికి షేరు విలువ ఏకంగా 909.20 రూపాయలకి చేరుకొని కంపెనీ మొత్తం విలువ 2110 కోట్లకు చేరుకొంది .
ఇప్పటివరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దోచుకొన్న డబ్బునంతా సొంత
కంపెనీలో షేర్లు రూపంలోకి మార్చుకొని వైట్ మనీగా మార్చారు . మీరు
పరిశీలించండి చూడండి , ముఖ్యమంత్రి కాకముందు 200 కోట్ల ఉన్న హెరిటేజ్ విలువ
ఈరోజుకి 2110 కోట్లు అయ్యింది . అనగా గోదావరి పుష్కరాల అవ్వగానే 1000
వెయ్యి కోట్లు పెరిగింది , మొన్న కృష్ణ పుష్కరాలు అవ్వగానే మరో వెయ్యికోట్ల
పెరిగింది .
ఇక్కడవరకు బాగానే ఉంది దోచుకొన్న డబ్బుని హెరిటేజ్ షేర్లలోకి మార్చారు ,
కాకపొతే దీనివలన పెద్దగా లాభంలేదు , ఎందుకంటే ఈ షేర్లు బయట వాళ్ళకి ఈ
పెరిగిన ధరకు అమ్ముకొంటేనే వీళ్లకి తిరిగి ఆ డబ్బులు వచ్చేది ,మరి కంపెనీ
అసలు విలువ చుస్తే అంత లేదు , షేరు ధరలేమో ఆకాశంలో ఉన్నాయి . కంపెనీ
విలువకి షేరు ధరకి అసలు పొంతనే లేదు , అందుకే షేర్లు కొనటానికి ఎవ్వరూ
ముందుకి రాలేదు .
సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకి నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది . చాలా
రోజులు క్రితమే నోట్లు రద్దు కాబోతున్నాయి తద్వారా సంక్షోభం రాబోతున్నదని
ముందే ఉప్పందుకొన్న చంద్రబాబు తన మనుషులతో తన బినామిలతో కనపడ్డ భూములను
కొనిపించాడు . ఒక అంచనా ప్రకారం దగ్గరదగ్గర 40 వేళా ఎకరాలు బాబు బినామీలు
భూములు కొన్నారు . అందుకే ఎవ్వరూ IDS స్కీమ్ లో కూడా దొరకలేదు . ఎదో
ఒకరిద్దరు సొంత mla లు తప్ప ( ఆదికేశవులు భార్య ) .
ఇకపోతే ఇదే అదునుగా మిగిలిన నల్లధనాన్ని , హేరిటేజ్ షేర్ల రూపంలోకి
మార్చిన డబ్బుని కూడా ఎలాగయినా మార్చుకోవాలని అంత్యత పకడ్బందీగా వెంకయ్య
నాయుడు అండతో అరుణ్ జైట్లీ సహకారంతో హేరిటేజ్ కి ఫ్యూచర్ ఇండియా ( బిగ్
బజార్ ) కి లింక్ కలిపాడు . ఈ డీల్ చూస్తే ఎవరికయినా దిమ్మ దిరాగాల్సిందే .
సరిగ్గా మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించటానికి ముందుగా అనగా నవంబర్ 7
తేదీన హేరిటేజ్ కంపెనీని ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) కి అమ్మేశారు . ఆ
వివరాలు చూస్తే మనకి దిమ్మతిరగాల్సిందే . పైన హెరిటేజ్ ప్రస్తుత విలువ ఎంతో
చూసాము కదా , అక్టోబర్ 2016 నాటికి 2110 కోట్ల విలువకి చేరుకొంది .
2110 కోట్ల కంపెనీని కేవలం 270 కోట్ల విలువ చేసే ఫ్యూచర్ ఇండియా కంపెనీ షేర్లు తీసుకొని అమ్మేశారు .
2110 కోట్లు ఎక్కడ 270 కోట్లు ఎక్కడ ? అంత తక్కువకి ఎందుకు అమ్మారు ?
ఎందుకంటే కంపెనీ విలువ అంతకన్నా ఎక్కువ చేయదు కనుక , మరి అలా చేయటం వలన
చంద్రబాబుకి ఫ్యూచర్ ఇండియా కంపెనీ వలన కలిగే లాభం ఏమిటి ?
--- 6,7,8 ఫోటోలు చూడండి - హెరిటేజ్ కి ఫ్యూచర్ ఇండియా కి జరిగిన డీల్ వివరాలు చూడండి .
బిగ్ బజార్ ద్వారా వేలకోట్లు ఎలా మారుస్తున్నారో చూద్దాం..
మొదట్లోనే చెప్పుకున్నాం కదా సంక్షోభంలో అవకాశాలు వెతుకుతాడాని ,
ఇప్పుడు కూడా అలాంటి అవకాశం సృష్టించాడు . హెరిటేజ్ కంపెనీని అమ్మేసిన
ఫ్యూచర్ ఇండియా ద్వారా ఈసారి అటునుండి నరుక్కోచ్చాడు . నోట్లరద్దు తర్వాత
ప్రజలందరూ బ్యాంకులలో పాత నోట్లు మార్చుకొంటుంన్నారు . అలాంటి పాత నోట్లు
మార్చుకొనే అవకాశం ఫ్యూచర్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నడిచే బిగ్ బజార్ ని
కూడా చేర్చారు . దీనికి వెంకయ్య అండతో అరుణ్ జైట్లీని , RBI ని కూడా
ఒప్పించారు . పాత నోట్లు మార్చుకొనే అవకాశం బ్యాంకులు కాకుండా ప్రైవేట్
కంపెనీలలో ఒక్క బిగ్ బజార్ కి మాత్రమే ఇచ్చారు , అదీ చంద్రబాబు పవర్ .
గత నెల 24 నుండి దేశవ్యాప్తంగా ఉన్న 260 బిగ్ బజార్ షాప్ లలో పాత నోట్లు
మార్పిడి మొదలు పెట్టారు . రోజుకి దగ్గర దగ్గర 250 కోట్లు ఈ బిగ్ బజార్
షాప్లలలో మారుస్తున్నారు . ఒక అంచనా ప్రకారం 10000 ( 10 వేల కోట్లు )
కోట్లు డిసెంబర్ ఆఖరి లోపు మార్చే అవకాశం ఉంది .
ఈ షాప్ లలో సామాన్యులకు ఇచ్చేది 1 శాతం మిగతా 99 శాతం చంద్రబాబు మరియు
బీజేపీ పెద్దల డబ్బుని మారుస్తున్నారు . ఇలాంటి స్కెచ్ ముందే వేసిన
చంద్రబాబు తక్కువ ధరకు హెరిటేజ్ ని అమ్ముకొని బిగ్ బజార్లో భాగస్వామిగా
చేరాడు . ఇప్పుడు ఆ బిగ్ బజార్ ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు నల్లధనాన్ని
తెల్ల ధనం గా మారుస్తున్నారు .
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి రోజు బిగ్ బజార్ SBI తో టైఅప్
అయి ఈ నోట్ల మార్పిడి చేస్తుంది అని ప్రకటించారు . అదే రోజు అరవింద్
కేజ్రీవాల్ , SBI నే డబ్బులు ఇవ్వలేక ప్రతొరోజు ప్రజలని వెనక్కి పంపుతుంది ,
అలాంటిది ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రతొరోజు అంత పెద్ద మొత్తంలో ఎలా ఇస్తది ?
అసలు బిగ్ బజార్ కంపెనీకె ఈ అవకాశం ఎందుకు ఇచ్చారు అని విమర్చించాడు .
ఆవిమర్శలకు స్పందించిన బిగ్ బజార్ అధినేత కిషోర్ బియాని మేము SBI దగ్గర
మేము కొత్త నోట్లు తీసుకోవటం లేదు , మా కంపెనీ రోజు వారీ అమ్మకాల ద్వారా
వచ్చే డబ్బులతో పాత నోట్లు మారుస్తాం అని ప్రకటించాడు . అనగా వాళ్ళు రోజుకి
దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల క్యాష్ లావాదేవీలు చేయాలి , ఇది అసలు జరిగే
పనేనా ?
--- 13,14 ఫోటోలు చూడండి అరవిందు కేజ్రీవాల్ ట్వీట్ కి కిషోర్ ఇచ్చిన సమాధానం చూడొచ్చు .
మొన్న చంద్రబాబు RBI కి ఫోన్ చేసి మూడు వేల కోట్లు తెప్పించాడు , నిన్న 2
వేల కోట్లు తెప్పించాడు అని వార్తలు చదివే ఉంటారు , ఇవి కూడా నిజమే .
కాకపొతే ఆ డబ్బులన్నీ బిగ్ బజార్ లకి చేర్చి అక్కడ వీళ్ల నల్లధనాన్ని
మార్చి కొన్ని వేల కోట్లు కొత్త నోట్లలోకి మారుస్తున్నారు . మొన్న శేఖర్ (
టీటీడీ మెంబెర్ ) దొరికిన 100కోట్లు కూడా బిగ్ బజార్ ల ద్వారా మార్చిన
డబ్బే . దేశంలో దొరుకుతున్న 100 ల కోట్లు కొత్త నోట్లు అన్నీ బిగ్ బజార్
ద్వారా బయట ప్రపంచంలోకి వచ్చినవే .
---- 8,9,10,11,12 ఫోటోలు చూడండి , ఈ ఫ్యూచర్ ఇండియాకి బీజేపీ భక్తుడు
రాందేవ్ బాబాకి ఉన్న లింక్ లు కూడా తెలుస్తాయి , అదే రాందేవ్ బాబా
చంద్రబాబుని కలవటం చూడోచ్చు . దేశంలో ఇలాంటి అక్రామార్కులు అందరూ ఈ ఫ్యూచర్
ఇండియా ( బిగ్ బజార్ ) ద్వారానే వ్యవహారం నడుపుతున్నారు .
ఇలాంటి వేల కోట్లు మార్చుకోవడం కోసమే హేరిటేజ్ కంపెనీని బిగ్ బజార్ కి అమ్మేసి దానిలో చంద్రబాబు భాగస్వామి అయ్యాడు .
Source From:
Mani Annapureddy