631కోట్లు. అవును, అక్షరాలా 631 కోట్ల నగదు. శేఖర్‌రెడ్డి ఇళ్లలో ఇప్పటి
వరకూ లభించిన మొత్తం నగదు. అంతా.. కరెన్సీ నోట్లే. అందులో వందల కోట్లు
కొత్త 2 వేల నోట్లే. ఇంత భారీ మొత్తంలో సొమ్ము లభించడం దేశ చరిత్రలోనే ఇదే
ప్రధమం. అందులోనూ.. మొత్తానికి మొత్తం కరెన్సీ నోట్ల రూపంలో దొరకడం
విచిత్రం. కనీసం బ్యాంకుల్లో కూడా ఒకేసారి ఇంత పెద్ద నగదు డబ్బుల రూపంలో
ఉండదు. అలాంటిది, ఓ కాంట్రాక్టర్ ఏకంగా 631 కోట్లు.. నోట్ల రూపంలో దాచడం
ఇప్పడి వరకూ కనీవినీ ఎరుగని విషయం. కానీ.. ఇది నిజం
చెన్నై, వేలూరులోని శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శేఖర్‌రెడ్డి అడిటర్ ప్రేమ్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరపగా.. తాజాగా మరో 500కోట్ల నగదు లభ్యమైంది. దీంతో.. ఇప్పటి వరకు దొరికిన మొత్తం నగదు విలువ.. 631కోట్లకు చేరింది. అటు, ఇప్పటి వరకూ మొత్తం.. 178కిలోల బంగారం లభ్యమైంది. నగదు, బంగారం కాక, వెయ్యి కోట్ల విలువైన ఆస్థి పత్రాలు గుర్తించారు. భారీగా డాక్యుమెంట్లు ఉండటంతో.. 30మంది అధికారులు ప్రత్యేకంగా ఈ ఆస్థి పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో పత్రాల లెక్క పూర్తయితే.. సంపద విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. అటు, శేఖర్‌రెడ్డి భార్య జయశ్రీని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బినామీ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే, శేఖర్‌రెడ్డికి సంబంధించిన 17బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. ప్రస్తుతం.. ఆ బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ పని పూర్తైతే.. నల్లత్రాచు కాస్తా అనకొండగా మారడం ఖాయం. అదే జరిగితే.. దేశంలోనే శేఖర్‌రెడ్డి కేసు మరింత సంచలనంగా మారుతుంది. నల్ల కుభేరుడు శేఖర్‌రెడ్డి కేసులో కీలక పరిణామం. ఐటీ దాడుల్లో కోట్లకు కోట్లు నగదు.. కిలోలకు కిలోలు బంగారం.. వేల కోట్ల ఆస్థులు వెలుగు చూస్తుండటంతో కేసు విచారణ ఐటీ పరిధి దాటిపోయింది. దీంతో.. శేఖర్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు జరిగిన ఐటీ సోదాల వివరాలను సీబీఐ పరిశీలిస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ వెలుగు చూడనంత నల్ల ధనం బయటపడటంతో.. సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సిద్ధమవుతోంది. ఐటీ అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తోంది. బహుషా.. ఈ సాయంత్రం నుంచి కేసు సీబీఐ చేతిలోకి వెళ్లిపోనుంది.