గనుల ఘనుడు, మైనింగ్ మాఫియా సామ్రాజ్యాధినేత, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి ఇప్పుడు మరో కేసులో చిక్కుకున్నారు. గాలి
మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. గాలి తన కూతురు బ్రాహ్మణి పెళ్లి
కోసం ఏకంగా రూ.100 కోట్ల నల్లధనాన్ని మార్చినట్టు ఆరోపణలు
వస్తున్నాయి.
ఈ మేరకు అక్కడ ఓ రెవెన్యూ అధికారి డ్రైవర్ రమేశ్ గౌడ సూసైడ్ కలకలం సృష్టిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి 100 కోట్ల రూపాయల్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక కూడా గాలి తన కుమార్తె పెళ్లిని కోట్లు కుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు.
ఈ క్రమంలోనే బళ్లారికి చెందిన ఓ రెవెన్యూ అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు రమేష్ గౌడ్. గాలి ముఠా సభ్యులు.. వంద కోట్ల రూపాయల పాత నోట్లను.. రమేష్ గౌడ మధ్య వర్తిత్వంగా మార్పిడి చేశారు. 20 శాతం కమీషన్ తీసుకున్న రమేష్ గౌడ్ గాలి గ్యాంగ్‌కు కొత్త నోట్లు ఇచ్చాడు. అయితే కొత్త నోట్లు తక్కువ రావడంతో గాలి అనుచరులు మిగతా డబ్బు కోసం డ్రైవర్ రమేష్ గౌడ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. వేధింపులకు దిగారు.
గాలి అనుచరుల వేధింపులు ఎక్కువవ్వడంతో రమేష్ గౌడ్ సూసైడ్
చేసుకున్నాడు. చనిపోయే ముందు మొత్తం వ్యవహారాన్ని నోట్ గా రాశాడు.
వేధింపులు తట్టుకోలేక.. బెదింపులకు భయపడి చనిపోతున్నట్లు చెప్పాడు. గాలి
జనార్థన్ రెడ్డి రూ.100 కోట్ల విలువైన పాత నోట్లు మార్చినట్లు నోట్ లో
రాశాడు. రమేష్ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.
ఈ మేరకు అక్కడ ఓ రెవెన్యూ అధికారి డ్రైవర్ రమేశ్ గౌడ సూసైడ్ కలకలం సృష్టిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి 100 కోట్ల రూపాయల్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాక కూడా గాలి తన కుమార్తె పెళ్లిని కోట్లు కుమ్మరించి అంగరంగ వైభవంగా చేశారు.
ఈ క్రమంలోనే బళ్లారికి చెందిన ఓ రెవెన్యూ అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు రమేష్ గౌడ్. గాలి ముఠా సభ్యులు.. వంద కోట్ల రూపాయల పాత నోట్లను.. రమేష్ గౌడ మధ్య వర్తిత్వంగా మార్పిడి చేశారు. 20 శాతం కమీషన్ తీసుకున్న రమేష్ గౌడ్ గాలి గ్యాంగ్‌కు కొత్త నోట్లు ఇచ్చాడు. అయితే కొత్త నోట్లు తక్కువ రావడంతో గాలి అనుచరులు మిగతా డబ్బు కోసం డ్రైవర్ రమేష్ గౌడ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. వేధింపులకు దిగారు.
No comments:
Post a Comment