cricket ad

Sunday 11 December 2016

అమ్మ వైద్య ఖర్చులు ఎంతో తెలుసా!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత వైద్యానికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా…తెలిస్తే ఆశ్చర్య పోతారు. అమ్మకు 75 రోజుల పాటు వైద్యం అందించిన చైన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం వేసిన మెడికల్ బిల్లు రూ.80 కోట్లు. మిగతా ఖర్చులు కలిపితే ఇది మరికాస్త పెరిగే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌తో ఈ విషయం బయటపడింది.
తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో ఇప్పటికే రూ.6 కోట్లు చెల్లించింది. ప్రజా ప్రతినిధులు అనారోగ్యానికి గురైనపుడు వైద్య ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. జయ వైద్యానికి అయిన ఖర్చులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత జయ ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారు. దీంతో ఈ అంతస్తులోని 30 గదుల అద్దెను జయ వైద్య ఖర్చుల్లోనే కలిపారు. వీటి ఒక రోజు అద్దె రూ.కోటి. ఎక్మో…ఇతర లైఫ్‌ సపోర్టు యంత్రాల చార్జీలు వీటికి అదనం. అలాగే, 39 మంది అపోలో డాక్టర్లకు కన్సల్టేషన్‌ చార్జీలు, మందులు, నర్సింగ్‌ చార్జీలు, లండన్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే, అతని బృందం, సింగపూర్‌ ఫిజియోథెరిపిస్టు చార్జీలు అదనం. అలాగే జయ భద్రతా సిబ్బందికి చెల్లించాల్సిన బేటా ఖర్చుల బిల్లును పోలీసుశాఖ భారీగానే పంపినట్టు సమాచారం.

No comments:

Post a Comment