cricket ad

Wednesday 30 November 2016

బ్రహ్మ తలల వెనక ఉన్న ఆసక్తికర కథ ఏంటి ?

బ్రహ్మ హిందువుల దేవుడు. త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ.. ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే.. మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెబుతారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలనూ.. వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే.. వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేద దేవుడు అని పిలుస్తారు.
ఈ విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. నాలుగు తలలు కలిగి దేవుడిగా బ్రహ్మను చెబుతారు. కానీ.. వాస్తవానికి బ్రహ్మకు ఐదు తలలు ఉండేవని బ్రహ్మ పురాణం చెబుతోంది. ఈ కథ ప్రకారం.. విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు ? బ్రహ్మ తలల వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐదు తలలు
నాలుగు తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేది ఐదు తలలట.
శతరూప
బ్రహ్మ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో.. శతరూప అనే దేవతను సృష్టించి.. ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ.
ఒక్కోవైపు ఒక్కో తల
బ్రహ్మను వ్యతిరేకిస్తూ.. శతరూప అన్ని వైపులకూ పరుగుపెట్టింది. అలా ఆమె వెనక పరుగెత్తే సమయంలో బ్రహ్మ ఒక్కో వైపు ఒక్కో తల ఏర్పరచుకున్నాడు.
తల నరకడం
అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే యత్నంలో శిశుడు బ్రహ్మకు చెందిన పై తలను నరికేశాడు.
బ్రహ్మ కూతురుగా
అంతేకాదు శివుడు శతరూపను బ్రహ్మ కూతురిగా భావించాడు. తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మకు కూతురవుతుందని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని… నిర్ణయించుకుని.. తల నరికేశాడు.
బ్రహ్మకు పూజలు లేవు
బ్రహ్మ తలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవాలయాల్లోనూ పూజించకూడదని.. శివుడు సూచించాడు.
శివ, వైష్ణవాలయాలు
అందుకే కేవలం శివుడు, విష్ణువులను మాత్రమే పూజిస్తున్నాం. దాదాపు బ్రహ్మను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శివాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి కానీ.. బ్రహ్మకు ఆలయం లేదు.
ఎవరు గొప్ప మరో కథనం ప్రకారం బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవాళ్లని ఒకరికొకరు వాదించుకుంటున్న సమయంలో.. శివుడు బ్రహ్మ తల నరికేసినట్టు తెలుస్తోంది.
శివుడి చేతిలో బ్రహ్మ పుర్రె
సాధారణంగా శివుడి ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్లే పుర్రె బ్రహ్మ ఐదో తల అని చెబుతారు.
నీళ్లు తాగడానికి
అంతేకాదు కొన్ని సందర్భాల్లో శివుడు పుర్రెను నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాడట. అలాగే పుర్రెలతో తయారు చేసిన మాల ధరిస్తాడట. ఆ పుర్రెనే శివుడు నరికిన బ్రహ్మ తలగా వివరిస్తారు.

No comments:

Post a Comment