cricket ad

Wednesday 30 November 2016

పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో చెప్పిన నాగబాబు

సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ.. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎందుకు స్థాపించారన్న ప్రశ్నకు అతని సోదరుడు నాగబాబు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గొప్ప భావజాలం, మానవత్వం, గొప్ప గుణం పవన్ కు ఉన్న లక్షణాలని చెప్పారు. పవన్ కల్యాణ్ దేన్నీ అంత సాధారణంగా వదలడని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరినందుకో.. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లేకపోవడం వల్లో జనసేనను పవన్ స్థాపించలేదని.. ప్రజలకు అండగా నిలబడాలనే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పారు.
తన ఎదుట ఎవరైనా బాధ పడితే పవన్ తట్టుకోలేడని.. ఎంతో నిరాశతోనే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టాడని తెలిపారు. పవన్ ఇంతకు ముందు చెప్పినట్టే, అతని ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదని.. తన వల్ల కూడా తమ్ముడు కొంచెం డబ్బు నష్టపోయాడని తెలిపారు. అయితే.. డబ్బుకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడని.. ఆర్థిక సమస్యలను లెక్క చేయడని చెప్పారు. మరో నాలుగు లేదా ఐదు సినిమాలు చేస్తే.. ఆర్థికంగా సెటిల్ అవుతాడని.. అప్పుడు రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడని చెప్పారు.

No comments:

Post a Comment