cricket ad

Wednesday 30 November 2016

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?
మ‌న శ‌రీరంలో ఎన్నో అవ‌య‌వాలున్నాయి. అవ‌న్నీ ఒక్కో ప‌ని కోసం నిర్దేశించ‌బ‌డ్డాయి. మ‌నం తినే ఆహారం నుంచి అవి శ‌క్తిని గ్రహించి త‌మ విధులను నిర్వ‌హిస్తాయి. అయితే మ‌న దేహంలో ఉన్న ప‌లు అవ‌య‌వాల్లో కొన్నింటి ఉప‌యోగం ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో అలాంటి భాగాల‌ను వారు ఉప‌యోగం లేనివిగా భావిస్తుంటారు. కానీ వాటితో కూడా ఏదో ఒక ఉప‌యోగం ఉంటుంది. అలాంటి అవ‌య‌వాల్లో కొండ నాలుక కూడా ఒక‌టి. అవును, అదే. దాని వ‌ల్ల ఉప‌యోగం ఏంటో చాలా మందికి తెలియ‌దు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మ‌నం నిత్యం ఘ‌న‌, ద్ర‌వ ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటాం క‌దా. వాట‌న్నింటినీ ఆహార‌నాళం ద్వారా జీర్ణాశ‌యంలోకి స‌రిగ్గా వెళ్లేలా కొండ‌నాలుక దారి చూపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌గినంత ఉమ్మిని స్ర‌వింప‌జేస్తూ నోటిని తేమ‌గా ఉంచుతుంది. ఆ ఉమ్మి జీర్ణాశ‌యంలోకి వెళ్లి ఆహారం జీర్ణం అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం స్వ‌ర‌పేటిక ద్వారా స‌రిగ్గా మాట్లాడేందుకు కూడా కొండ నాలుక ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరెప్పుడైనా బాగా మాట్లాడేట‌ప్పుడు ఒక్కోసారి ద‌గ్గు వ‌స్తుంది గ‌మ‌నించారా, అవును. ఆ స‌మ‌యంలో కొండ నాలుక పొడిగా మార‌డం వ‌ల్ల ద‌గ్గు వ‌స్తుంది. అందుకే ఎక్కువ‌గా మాట్లాడేవారు మ‌ధ్య మ‌ధ్య‌లో నీటిని తాగుతుంటారు. దీంతో కొండ నాలుక తేమ‌గా మారుతుంది. దీని వ‌ల్ల ఇంకొంచెం ఎక్కువ సేపు మాట్లాడేందుకు అవ‌కాశం ఉంటుంది.
భూమిపై ఉన్న ఇత‌ర క్షీర‌దాల‌ను, మ‌నుషుల‌ను వేరు చేసే అవ‌య‌వం కూడా కొండ నాలుకే. అందుకే మ‌నం మాట్లాడ‌గ‌లుగుతాం. జంతువులు, ప‌క్షులు మాట్లాడ‌లేవు. తెలుసుకున్నారుగా, కొండ నాలుక వ‌ల్ల ఉప‌యోగం ఏమిటో! ఇది చ‌దివాక ఇక ఎవ‌రూ దాంతో ఏమీ ఉప‌యోగం లేద‌ని అన‌రు గాక అన‌రు! అంతేగా!

No comments:

Post a Comment