cricket ad

Wednesday 30 November 2016

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు :
నిరాశా, నిస్ప్రుహలకు లోనైనా మనిషిని పునరుజీవితుణి చేస్తుంది`సుదర కాండము
మానసికముగా బలహీనమైన వాడిని మానసికముగా బలోపెతున్ని చేస్తుంది సుందర కాండము
కేవలం పురుష ప్రయత్నం చాలదు . దైవయత్నం కుడా ఉండాలి . అలాగని దైవప్రార్దన చాలదు . మానవ ప్రయత్నం కూడా ఉండాలి . పురుష ప్రయత్నం , దైవయత్నం కలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది అని చాటి చెప్పినది సుందర కాండము
మనము చేసే కార్యము లో చిత్తశుద్ధి ఉంటే ,మన ప్రమేయము లేకుండానే మనకు బయట నుండి సాయం అందుతుంది అని మనకు తెలియజేసేదే సుందర కాండము .
మన సమస్యకు పరిష్కారము ఎదురుగా ఉన్నా ,మన మనస్సు కల్లోలముగా ఉన్నపుడు ఆ పరిష్కారము మనకు కనపడదు . నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే ,ఇంతేనా అని అనిపిస్తుంది , పరిష్కారము కళ్ళెదుట కనపడుతుంది అని బోదించింది సుందర కాండము .
జీవితములో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముగా ఎదుర్కొంటే , మనకు సాయము చేసేవాళ్ళు మనకు కనపడకుండా మన పక్కనే ఉండి సాయము చేస్తుంటారు అని తెలియజేసేది సుందర కాండము .
కోపము అన్ని అనర్దాలకు మూలము ,కోపములో ఏమి చేస్తున్నామో తెలియకుండా చేసేస్తాము తుదకు దు:ఖాలపాలవుతము అని భోదించేది సుందర కాండము .
మనిషికి ఎంత శారీరక బలము ఉన్నా , దానికి బుద్ధిబలం తోడైతేనే గాని రాణించదు అన్న విషయాన్ని తెలియచెప్పేది సుందర కాండము .
ఎన్ని శివపూజలు చేసినా ,ఎంతటి నిష్టాగరిష్టుడైన ,గుణగనాలు మంచివి కాకపోతే ఆ శివపూజలు అతనిని రక్షించలేవు ,అతనికి పతనము తప్పదు అని నిరూపించినది సుందర కాండము .
ఎవరి శక్తి వారికి తెలియదు . ప్రతి మనిషిలోను అంతర్గతముగా అపారమైన శక్తి ఉంటంది . ఆ శక్తి ఒక్కోసారి తనంతట తానే బహిర్గతమవుతుంది . మరి కొన్ని సందర్భాల్లో ఇతరులు చెబితేనే గాని బయట పడదు . కాబట్టి పెద్దవారి మాటలు ,మన శ్రేయోభిలాషుల మాటలు శ్రద్దగా విని , ఆచరించి ,మన శక్తి యుక్తులను సమర్ధవంతముగా వినియోగించుకోవాలి అని చాటి చెప్పినది సుందర కాండము .
share it

No comments:

Post a Comment