cricket ad

Wednesday 30 November 2016

విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ. శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు. శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై. ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.

విశ్వకర్మ పూజ:

విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.

విశ్వకర్మ నిర్మాణాలు:

విశ్వకర్మ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.

No comments:

Post a Comment