cricket ad

Wednesday 30 November 2016

పెళ్ళికి ముందు సహజీవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు..!

ఓ పెళ్లి కానీ జంట సహజీవనానికి సహజీవనానికి సిగ్నల్ ఇచ్చింది. ప్రేమించుకున్న ఓ హిందూ యువతి, ఓ ముస్లిం యువకుడు కలసి ఉండవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ వివరాలలోకి వెళితే.. గుజరాత్‌ లోని పాకిస్థాన్ సరిహద్దు గ్రామం ధనేరా కు చెందిన ముస్లిం యువకుడు (20 ), అదే ఊరికి చెందిన హిందూ అమ్మాయి (19 ) ప్రేమించుకున్నారు. స్కూల్‌ మేట్స్‌ అయిన కారణంగా.. కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. గత జులైలో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. అబ్బాయి మైనర్‌ కావడంతో పెళ్లి సాధ్యం కాలేదు.
దీనితో ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లిద్దరూ కలసి ఉన్నప్పుడు.. గత సెప్టెంబర్‌ లో ఆ యువతి బంధువులు అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. ప్రియురాలితో కలిసే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ ముస్లిం యువకుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశాడు. కోర్టు ఆదేశాల మేరకు బనస్‌ కాంత్‌ పోలీసులు అమ్మాయిని విచారణకు హాజరుపర్చగా.. తాను ఆ యువకుడితో ఉంటానని కోర్టుకి తెలిపింది.
ఇరు పక్షాల వాదనలు విన్న సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ అఖిల్‌ ఖురేషీ, జస్టిస్‌ బీరేన్‌ వైష్ణవ్‌ లు.. ఆమెకు న్యాయసహకారం అందించకుండా ఉండలేమని.. ఆమెకు ఇష్టమైన చోట ఉండగోరే హక్కును కాదనలేమని చెప్పి.. తనకు ఇష్టమైతే ‌20 ఏళ్ల యువకుడితో కలిసే ఉండొచ్చు అని తీర్పు చెప్పారు. అయితే.. 21 ఏళ్లు నిండగానే అమ్మాయిని పెళ్లి చేసుకునే విధంగా యువకుడితో  అఫిడవిట్‌ దాఖలుచేయించారు.

No comments:

Post a Comment