cricket ad

Wednesday, 30 November 2016

సులువుగా బ‌రువు తగ్గ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారా.. అయితే చిన్న మార్పులు మంచి ఫలితాన్నిస్తుంది.

సులువుగా బ‌రువు తగ్గ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతున్నారా...అయితే మ‌న రోజూ వారీ డైట్‌లో చేసుకునే చిన్న చిన్న మార్పులు మంచి ఫలితాన్నిస్తుంది. నిత్యం వంటల్లో ఉపయోగించే ఆహారపదార్థాలతోనే సులువుగా బరువు తగ్గించుకోవచ్చు. ఘాటుగా ఉండే అల్లంలో ఎన్నో రకాలైన ఔషధ గుణాలున్నాయి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ వంటి ధర్మాలతోపాటు ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు అల్లంలో ఉన్...
అంతేకాదు అల్లంలో బరువు తగ్గించే, కొవ్వును కరిగించే గుణాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలీదు. అల్లం నీటిని తాగితే సులభంగా బరువు తగ్గొచ్చట. పొట్ట, నడుము, తొడల వంటి భాగాల్లో అధికంగా పేరుకుపోయిన కొవ్వును సులభంగా తగ్గించే గుణం అల్లంలో పుష్కలంగా ఉందట. ఈ క్రమంలో జింజర్ వాటర్‌ను ఎలా తయారు చేసుకోయాలో తెల్సుకుందాం...

అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించాలి. ఇలా 10 నిమిషాలు మరిగించి వడకట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న నీటిని నిత్యం తాగుతుంటే సులభంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం మొదలవుతుంది. అయితే కనీసం 1 లీటరు వరకైనా జింజర్ వాటర్‌ను ప్రతిరోజు తాగాలి.


No comments:

Post a Comment