cricket ad

Tuesday 13 December 2016

వెయ్యి కోట్ల ఆస్తులు.. 130కోట్ల నగదు, 170కిలోల బంగారం.. ఇంకా వెలుగు చూసే అవకాశం -

నల్ల కుబేరుడు శేఖర్‌రెడ్డి ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ వెలుగు చూడనంత భారీ ఖజానా. వెతుకుతున్న కొద్దీ బయటపడుతున్న నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు. ఐటీ అధికారులతో సహా యావత్‌ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో గుట్టలకు గుట్టలు నల్లధనం బయటపడుతోంది. శేఖర్‌రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో మరోసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన సహచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్‌ ఇళ్లలోనూ దాడులు చేశారు. వరుస దాడులతో ఇప్పటి వరకు 131కోట్ల కరెన్సీ నోట్లు, 170కిలోల బంగారం లభించింది. 
తాజాగా.. ఐటీ దాడులు చెన్నై నుంచి వేలూరుకు మారాయి. వేలూరులో జరిపిన సోదాల్లో.. వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీ వెలుగుచూడటంతో అధికారులు అవాక్కవుతున్నారు. శేఖర్ రెడ్డి భార్య జయశ్రీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమె నుంచి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు సీజ్‌ చేశారు. బినామీ ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. 
టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసిన శేఖర్‌ రెడ్డి.. ఆ శ్రీవారి ఖజానాతో పోటీ పడేలా ఆస్థులు పోగేశాడు. ఆ కుబేరుడికే పోటీ ఇచ్చేలా నల్లకుబేరుడిగా అవతరించాడు. నేడు శేఖర్‌రెడ్డి పాపం పండటంతో.. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయన పదవి ఊడింది. బోర్డు నుంచి శేఖర్‌రెడ్డిని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఇసుక నుంచి తైలం తీయవచ్చు.. అనేది పాత మాట. ఇప్పుడు అదే ఇసుక కాంట్రాక్టులతో కోట్లకు కోట్లు కూడబెట్టాడు శేఖర్‌రెడ్డి. ఇసుకతో పాటు తమిళనాడులో అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ కాంట్రాక్టులు శేఖర్‌రెడ్డి చేపట్టేవాడు. అధికారపక్షానికి అతి దగ్గరగా ఉండేవాడు. ఇది చాలదా.. కోట్లు కొల్లగొట్టడానికి. అందుకే.. శేఖర్‌రెడ్డి ఇంట్లో ఎందెందు వెతికినా అందండు నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇంట్లోనే కాదు కార్లలోనూ కరెన్సీ మూటలే. అందులోనూ.. కొత్త రెండు వేల నోట్లు అవడం మరింత విచిత్రం. ఏదైనా పాపం పండే వరకే. ఇప్పుడదే జరుగుతోంది. శేఖర్‌రెడ్డి బోషాణం బద్ధలవుతోంది. ఇప్పటికే వెయ్యి కోట్ల వరకు ఆస్తులు.. 130కోట్ల నగదు, 170కిలోల బంగారం లభించగా.. సొదాలు ఇంకా కొనసాగుతుండటంతో మరింత సొమ్ము వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. 
చెన్నైలో శేఖర్ రెడ్డి, ఆయన బంధువులు, బిజినెస్‌ పార్ట్‌నర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు జరిపారు. టి.నగర్‌,  కాట్పాడి మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. మరో 17 కోట్ల డబ్బు, మరో 27 కిలోల బంగారం సీజ్ చేశారు. 127 కేజీల బంగారంలో 70 కేజీలు కేవలం కడ్డీల రూపంలోనే  ఉన్నాయి. వీటిని చెన్నైలోని ఓ హోటల్‌ నుంచి  స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కూడా కీలకమైన సమాచారం రాబట్టిన అధికారులు... ముఖ్యమైన డాక్యుమెంట్లను సీజ్‌ చేశారు. అలాగే శేఖర్‌రెడ్డికి ఏపీ, కర్ణాటకల్లో భారీ ఆస్తులున్నట్టు గుర్తించిన అధికారులు.. బినామీ ఆస్తులపైనా ఆరా తీస్తున్నారు. 
డబ్బు, బంగారం సీజ్ చేయడంతోపాటూ శేఖర్‌రెడ్డి కుటుంబానికి చెందిన మొత్తం 34 బ్యాంకు లాకర్లకు అధికారులు సీల్‌ వేశారు. వీటిని ఇంకా పరిశీలించాల్సుంది. మరోవైపు శేఖర్‌ రెడ్డిని ప్రభుత్వం కూడా ఆయన్ను టీడీడీ బోర్డు నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62864&SID=79&Title=IT-Raids-on-TTD-Member-Sekhar-Reddy-Friends-House-RS-170-Cr-Money,-130-Kg-Gold-Seized#sthash.XrMjk1PG.dpuf

No comments:

Post a Comment