cricket ad

Tuesday 13 December 2016

కొత్త నోట్ల తరలింపులో బ్యాంక్ సిబ్బంది బంధువులు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భారీగా కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. 92 లక్షల 2 వేల రూపాయల నోట్లు తరలిస్తుండగా ఏడుగురిని పట్టుకున్నారు కర్ణాటక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.
పాతనోట్లను మార్చేందుకు  15 నుంచి 35 శాతం కమిషన్ తీసుకుంటుండగా అధికారులకు దొరికారు. ఈ మార్పిడి ముఠాలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఉన్నారు. బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగి బంధువులు.. రూ.92లక్షల 2వేల నోట్లతో దొరకటం కలకలం రేపుతోంది. బ్యాంక్ సిబ్బందే ఇలా పక్కదారిలో కోట్లకు కోట్లు తరలిస్తుండటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పుడు దొరికిన డబ్బుతోపాటు.. ఈ 30 రోజుల్లో ఇంకెంత డబ్బును అక్రమంగా మార్చారు.. తరలించారు అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు ED అధికారులు.

No comments:

Post a Comment