cricket ad

Thursday 15 December 2016

డిజిటల్‌ చెల్లింపులపోటీ.. మీదే రూ.కోటి రెండు పథకాలను వెల్లడించిన నీతి ఆయోగ్‌

దేశంలో పెద్దనోట్లను రద్దుచేసిన అనంతరం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టింది. డిజిటల్‌ లావాదేవీల వైపు ప్రజల్ని మళ్లించేందుకు కొత్తగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నట్లు గురువారం నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ప్రకటించారు. ఈ నెల 25న క్రిస్మస్‌ పండుగ నుంచి ఈ పథకాలను అమలుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రిస్మస్‌ నుంచి ఏప్రిల్‌ 14 వరకు ఈ ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన వినియోగదారులకు సంబంధించిన పథకం కాగా, డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన వ్యాపారులకు ఉద్దేశించినది. అయితే లక్కీ గ్రాహక్‌ యోజన పథకం కింద ప్రతిరోజు 15వేల మంది విజేతలను ఎంపికచేసి వారికి రూ.1000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. అలాగే.. వారానికి ఒకసారికి లక్కీ గ్రాహక్‌ యోజన కింద ఎంపికచేసిన 7వేల మందికి రూ.లక్ష వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద వారానికొకసారి 7వేల మందిని ఎంపికచేస్తారు. వారికి రూ.50వేలు చొప్పున ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. లక్కీ గ్రాహక్‌ యోజన కింద ముగ్గురికి మెగా అవార్డులు ఇస్తారు. మొదటి విజేతకు రూ.కోటి, రెండో విజేతకు రూ.50లక్షలు, మూడో విజేతకు రూ.25లక్షల చొప్పున అందజేస్తారు. అలాగే డిజి ధ‌న్‌ వ్యాపారి యోజన పథకం కింద కూడా మెగా అవార్డులు ప్రకటించారు. మొదటి విజేతకు రూ.50లక్షలు, రెండో విజేతకు రూ.25లక్షలు, మూడో విజేతకు రూ.5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. ఈ మెగా అవార్డులను ఏప్రిల్‌ 14న ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment