cricket ad

Saturday 17 December 2016

టన్నుల బంగారం కొట్టేసి.. పిచ్చి నాటకాలు!

అది 1857వ సంవ‌త్స‌రం… అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో మూడు ట‌న్నుల బంగారంతో ఓ భారీ నౌక బ‌య‌లు దేరింది. అనుకోకుండా ఓ పెద్ద తుఫాను వ‌చ్చింది. భారీ నౌక న‌డిసంద్రంలో మునిగిపోయింది. క‌ట్ చేస్తే  130 సంవ‌త్స‌రాల త‌ర్వాత అంటే 1988లో  మునిగిన నౌక‌లో ఉన్న మూడు ట‌న్నుల బంగారం థామ్స‌న్ అనే వ్య‌క్తి వెలికి తీసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అప్ప‌టి నుంచి థామ్స‌న్ కోసం పోలీసులు వెతుకుతున్నా  వారి క‌ళ్లు క‌ప్పి ఎంతో చాక‌చ‌క్యంగా త‌పిపంచుకుతిరుగుతున్నాడు. ఇదంతా సినిమా స్టోరీలా ఉన్న‌ప్ప‌టికీ ఇదే నిజం. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది.
వివ‌రాల్లో కెళితే … ఈ బంగారాన్ని స‌ముద్ర‌పుటంచులనుంచి బ‌య‌ట‌కు తీసేందుకు థామ్స‌న్ త‌న స్నేహితుల సహకారం కోరాడు. బంగారాన్ని విజయవంతంగా బయటకు తీసుకొస్తే వారికి కూడా వాటా ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. బంగారాన్ని సముద్రం నుంచి తీసేందుకు థామ్సన్ ఓ రోబోను తయారు చేశాడు. ఇది 8000 అడుగున ఉన్న బంగారాన్ని వెలికి తీయగలే సామర్థ్యం ఉంది. ఈ రోబోను తయారు చేసేందుకు కావాల్సిన డబ్బును థామ్సన్ స్నేహితులే సమకూర్చారు. అంతా రెడీ అయిన తర్వాత రోబోను సముద్రంలోకి వదిలి మొత్తానికి మూడు టన్నుల బంగారాన్ని బయటకు తీసుకొచ్చాడు.   ఆ తర్వాత మొత్తం బంగారంతో థామ్సన్ ఉడాయించాడు.
2000వ సంవత్సరంలో తమకు న్యాయం చేయాల్సిందిగా థామ్సన్  మిత్రులు కోర్టుమెట్లెక్కారు.  ఆ బంగారాన్ని ఎప్పుడో అమ్మేసినట్లుగా థామ్సన్ కోర్టుకు సమాధానం ఇచ్చాడు. 2012లో కోర్టుకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం  థామ్సన్ కు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో థామ్సన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఫెడరల్ కోర్టు. ఇక అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.
రంగంలోకి దిగిన FBI థామ్సన్ కోసం వేట సాగించింది. మారు పేర్లతో విలాసవంతమైన హోటళ్లలో థామ్సన్ నివసించేవాడు. పక్కా సమాచారం అందుకున్న FBI పోలీసులు 2015 జనవరిలో ఓ హోటల్లో థామ్సన్ ను అదుపులోకి తీసుకున్నారు. మూడు టన్నుల బంగారంపై ఆరా తీశారు. అయితే ఆ బంగారం సంగతి గురించి తనకేమీ తెలియదని బుకాయించాడు. అది ఎక్కడుందో తనకు గుర్తులేదని చెబుతున్నాడు. థామ్సన్ తరపున వాదిస్తున్న లాయరు కూడా తన క్లైంట్ మెమొరీ లాస్ వ్యాధితో బాదపడుతున్నాడని తనకు ఏమీ గుర్తుండదని వాదించాడు.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే థామ్సన్ మెమొరీ లాస్ డ్రామాను తెరపైకి తెచ్చాడని భావించిన కోర్టు… ఆ బంగారు నిధి గురించి వివరాలు చెప్పేవరకు జైలులోనే ఉంచాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ రోజుకు 1000 డాలర్లు జరిమానా విధించింది.

No comments:

Post a Comment