cricket ad

Thursday 15 December 2016

యుఎస్‌లో సైబర్ నేరానికి పాల్పడిన భారతీయ విద్యార్ధి అరెస్ట్

కృష్ణమకుటో శర్మ అనే తెలుగు విద్యార్ధి లాస్ శాన్ ఫ్రాన్సిస్కోలోని చాటాంగో అనే కంపెనీకి చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేశాడు.  ఆ సంస్ధ ఇతర కంపెనీలకు చాట్ సర్వీసులు అందిస్తుంది.  2014 నవంబరు నుంచి 2015 జనవరి వరకు ఆ సంస్ధ కంప్యూటర్లు పనిచేయలేదు.  డిడాస్ అనే పద్దతిలో సైబర్ దాడులు చేస్తే ఒక్కసారిగా బోగస్ రిక్వెస్టులు వెల్లువెత్తి చివరకు ఆ వ్యవస్థ పనిచేయకుండా పోతుంది.  ఎక్స్‌ట్రీమ్ ఫైర్ అనే తరహా బోట్‌నెట్‌ను శర్మ ఉపయోగించినట్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.  కాలిఫోర్నియా రాష్ట్రంలోని లా కెనడా అనే ప్రాంతంలో ఎఫ్‌బీఐ అధికారులు శర్మను అరెస్టు చేశారు.  అతడు లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుతున్నట్లు తెలిసింది.  ఐదు రోజులపాటు నిర్వహించిన ఆపరేషన్‌లో 34 మందిని అరెస్టు చేశారు. కంప్యూటర్ పరిజ్ఞానం రాగానే తర్వాత ఏమవుతుందో తెలియక సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు.

No comments:

Post a Comment