cricket ad

Tuesday 13 December 2016

జయలలితకి చేసిన చికిత్స.. అతనికి చేస్తే 24 గంటల్లో లేచి కూర్చున్నాడు!

ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ కు గురి కావడంతో ఆమెను బతికించడానికి ఎక్మో యంత్రంతో చికిత్స చేశారు. అయినా.. ఆ చికిత్స జయలలిత ప్రాణాలు కాపాడలేక పోయింది. అయితే.. ఇప్పుడు ఇదే చికిత్స ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కాపాడింది. 43 ఏళ్ల టెక్కీ శ్రీనాథ్ కార్డియాక్ అరెస్ట్ కు గురి కావడంతో.. హఠాత్తుగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయకి తరలించారు. అయితే.. వైద్యులు జయలలితకు చేసిన ఎక్మో చికిత్సను శ్రీనాథ్ కు చేశారు. 24 గంటలు తిరిగేలోపల శ్రీనాథ్ గుండెను మామూలుగా కొట్టుకునే స్థితికి తీసుకొని వచ్చారు.
తన గుండె మామూలుగా కొట్టుకునే సరికి తనకు పునర్జన్మ ఎత్తినట్టు ఉందని శ్రీనాథ్ తెలిపాడు. నారాయణ హృదయాలయ ఇప్పటివరకు 500 మందికి ఎక్మో చికిత్సను చేశారట. విషమ పరిస్థితికి గురైన గుండెను కూడా ఈ చికిత్స ద్వారా సాధారణ స్థితికి తీసుకురావచ్చని చెబుతున్నారు. ఈ చికిత్సను రెండు పరిస్థితుల్లో చేస్తారని.. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు, రెండోది న్యుమోనియా లేదా గాయాల వల్ల ఊపిరితిత్తులు సరిగా పనిచేయనప్పుడు ఎక్మో ద్వారా ఈ చికిత్సను చేస్తారని చెబుతున్నారు. ఈ చికిత్సకు రూ.  3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని.. మన దేశంలో ఎంతో మంది గుండె కొట్టుకోవడం ఆగిపోవడం ద్వారా చనిపోతున్నా.. అందరికీ ఈ చికిత్స అందుబాటులో ఉండటం లేదని తెలుస్తుంది. అయితే.. ఇదే చికిత్స జయలలితకి చేసినా ఆమె మరణించడంపై.. అపోలో డాక్టర్ లు స్పందించాల్సి ఉంది.

No comments:

Post a Comment