cricket ad

Tuesday, 13 December 2016

ఆన్‌లైన్ చెల్లింపులు అదుర్స్‌

పెద్దనోట్ల రద్దు తర్వాత.. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవు.. ఏటీఎంలు తెరుచుకోవడం లేదు.. చేతిలో చిల్లర లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు ప్రజలు నెమ్మదిగా నగదు రహితం వైపు మళ్లుతున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు, కొనుగోళ్లకు అలవాటు పడుతున్నారు.  
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ చెల్లింపులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆన్ లైన్ కోనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ప్రజలు నెమ్మదిగా నగదు రహితం వైపు అడుగులేస్తున్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం కార్డు, చెక్‌ బుక్‌ల కోసం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్లు, డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు రెట్టింపయ్యాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో గత నెల కంటే 50-100 శాతం ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగే అవకాశాలున్నాయని.. గడిచిన వారం రోజుల గణాంకాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఈ-చెల్లింపులపై ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతోంది. లావాదేవీల సంఖ్యతో పాటు ఆయా లావాదేవీల విలువ మొత్తమూ భారీగా పెరుగుతోంది. ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ, సీటీఎస్‌ చెల్లింపులు సెలవు దినాల్లో జరగనందున... ఎనిమిది రోజులకే లెక్కించారు. నవంబరు నెలలో మొత్తం 67.15 కోట్ల ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగితే... డిసెంబరులో 9వ తేదీ నాటికి 29.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తంగా...  దేశవ్యాప్తంగా ప్రజలందరూ పెద్దనోట్ల రద్దును ప్రశంసిస్తూ నగదు రహితంపై అడుగులేస్తున్నారు.

No comments:

Post a Comment