cricket ad

Tuesday, 13 December 2016

పూజారులకు దక్షిణగా.. రద్దైన పెద్ద నోట్లు

ఓ యాగంలో పాల్గొన్న పూజారులకు దక్షిణగా రద్దైన రూ.1000, రూ.500 నోట్లను సమర్పించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు లక్ష చండీ మహా యాగం నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వేల మంది పూజారులు ఇందులో పాల్గొన్నారు. బీజేపీ నేత, హర్యానా లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ రిషి ప్రకాష్ శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
 
యాగంలో పాల్గొన్న 2000 మంది పూజారులకు ఒక్కొక్కరికి రూ.5000లు చొప్పున రద్దైన పెద్ద నోట్లను దక్షిణగా సమర్పించారు. అయితే చెలామణిలో లేని నోట్లు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి ఖర్చులు ఎలా అని వాపోయారు. దీంతో నిర్వాహకులు కొందరికి బస్ టికెట్లు ఏర్పాటు చేశారు. పూజారులకు దక్షిణగా సుమారు రూ.80 లక్షల రద్దైన పాత నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు దీన్ని ఖండిస్తున్నారు. దక్షిణగా పాత నోట్లు ఇస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు.

No comments:

Post a Comment