cricket ad

Monday, 12 December 2016

అమ్మ బుగ్గ‌పై ఆ రంధ్రాలు ఏంటి..?

జయలలితకు చికిత్స జరిగిన విధానం అత్యంత రహస్యంగా ఉంది. అపోలో ఆసుపత్రిలో ఎప్పుడేం జరిగిందో స్పష్టంగా వెల్లడికావడం లేదు.  ఆమె పార్థివ దేహాన్ని అత్యంత సమీపం నుంచి చాలా మంది చూశారు. ‘అమ్మ బుగ్గపై ఆ రంధ్రాలేంటీ’? అంటూ ఈ సామాజిక మాధ్యమంలో ఈ దృశ్యం జోరుగా చక్కర్లు కొడుతోంది. జయలలిత మరణించిన తరువాత ఆమె భౌతిక కాయాన్ని ఎంతో మంది తిలకించారు. అయితే ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఆసక్తి రేపాయి. చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగా ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహం కొన్ని రోజుల పాటు పాడవకుండా, కుళ్లి పోకుండా ఉండేలా వైద్యులు ‘ఎంబామింగ్‌‌’ చేస్తుంటారు. దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు,  దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపే ప్రక్రియ ఇది. అయితే సహజంగా ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు. జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి. జయలలితకు గుండె పోటు వచ్చినప్పటి నుంచి ఆమె మరణించే సమయం వరకూ వైద్యులు ‘ఎక్మో’ చికిత్స చేశారు. ఆ ప్రక్రియలోనే ‘ఎంబామింగ్‌‌’ కూడా నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే వీటికి భిన్నంగా జయ బుగ్గలపై ఇలా నాలుగు రంధ్రాలు కనిపిస్తుండటంతో అది ‘ఎంబామింగ్‌‌’ సూదితో ఏర్పడిన రంధ్రాలా.. లేదా ఇతర చికిత్సలు చేయడానికి వీలుగా చేసిన రంధ్రాలా అని చర్చ జోరుగా జరుగుతోంది.  అయితే జయలలిత బుగ్గపై కనిపిస్తున్న నాలుగు రంధ్రాలు ఏవిధంగా ఏర్పడ్డాయో అర్థం కావడం లేదని అనేక మంది అంటున్నారు.

No comments:

Post a Comment