cricket ad

Tuesday, 13 December 2016

రూ.500కోట్లతో కూతురి పెళ్లి చేసిన గాలి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

500 కోట్ల రూపాయల ఖర్చుతో కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన కర్నాటక మైనింగ్ డాన్, మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గాలి జనార్దన రెడ్డిపై నల్ల ధనం మార్పిడి ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడు, భూ సమీకరణ ప్రత్యేక అధికారి భీమా నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు సాయం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భీమా నాయక్ తో పాటు అతని కారు డ్రైవర్ మహ్మద్ ను గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి సమయంలో సుమారు రూ.100 కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు భీమా నాయక్ సహాయాన్ని తీసుకున్నారని, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ నాయక్ కారు డ్రైవర్ రమేశ్ గౌడ తన సూసైడ్ నోట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లికి డబ్బుని నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. పెళ్లి కూతురి చీర ఖరీదే 17 కోట్ల రూపాయలు కాగా, ఆభరణాల ఖరీదు 90కోట్ల రూపాయలు. నోట్లరద్దు వేళ దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీ కోసం పాట్లు పడుతుంటే, 2వేల రూపాయల నోటు దొరకడం కూడా గగనంగా ఉంటే, గాలి జనార్దన రెడ్డి మాత్రం కోట్ల రూపాయల డబ్బుని అవలీలగా ఖర్చు చేయడం సంచలనంగా మారింది.

No comments:

Post a Comment