cricket ad

Thursday, 15 December 2016

అఖిల్ పెళ్లి వెనక ఉన్న సీక్రెట్ బయట పడింది!

అక్కినేని నాగార్జున.. ఈ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అయితే నాగర్జున తమ పిల్లల ప్రేమను అంగీకరించి గొప్ప తండ్రిగా గౌరవాన్ని నిలుపుకున్నారు. తన చిన్న కుమారుడు అఖిల్ ప్రేమించిన శ్రీయా భూపాల్ తో వైభవంగా నిశ్చితార్ధం నిర్వహించారు.
వచ్చే ఏడాది గ్రాండ్ గా పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పెద్ద కొడుకు నాగ చైతన్య పెళ్లి చేయకుండా, చిన్న కుమారుడు పెళ్లి ఎందుకు చేస్తున్నారనే విమర్శలకు ఆయన ముందుగానే వివరణ ఇచ్చారు. చైతూ కళ్యాణం చేసుకోవడానికి కొంతకాలం గడువు కోరారని, అందుకే అఖిల్ పెళ్లి చేస్తున్నామని మీడియాకు నాగ్ చెప్పారు. అసలు కారణం అది కాదని సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. అఖిల్ కంటే నాలుగేళ్లు పెద్దది అనే విషయం బయట ప్రజలకు తెలియక ముందే పెళ్లి చేసేయాలని నాగార్జున తొందర పడుతున్నట్లు సమాచారం.
వివాహం అయిపోతే ఆ ప్రస్తావన ఎవరూ తీసుకు రారని, అందుకే సాధ్యమైనంత వరకు తొందరగా కళ్యాణం జరిపిస్తున్నట్లు టాక్. అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. నాగార్జున ఎవరికీ బయపడి పెళ్లి చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. లోకంలో భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉన్నవారు సంతోషంగా సంసారం సాగిస్తున్నారని చెబుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తమకంటే వయసులో పెద్దవారినే పెళ్లి చేసుకొని పర్ఫెక్ట్ కపుల్ గా జీవిస్తున్నారని, వారి స్పూర్తితో అఖిల్ తన కంటే ఒక ఏడాది పెద్దదైన శ్రీయను వివాహం ఆడడంలో ఎటువంటి తప్పులేదని వివరిస్తున్నారు.

No comments:

Post a Comment