cricket ad

Tuesday, 13 December 2016

సెల్ ఫోన్లకు సైబర్ కేటుగాళ్ల సవాల్

దేశం యావత్తు డిజిటల్ బాట పట్టనుంది. పల్లెల నుంచి పట్నాల వరకు అంతటా మొబైల్ లోనే పనులన్నీ సాగిపోతున్నాయి. ఇది ఒకవైపు మాత్రమే. మరోవైపు కొత్తకొత్త మాల్‌వేర్‌లు, వైరస్‌లూ పెరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడం పెను సవాల్‌గా మారుతోంది. అయితే వీటికి భద్రత అంతంత మాత్రమేనని .. జర భద్రమంటోంది తాజాగా రిలీజైన అసోచామ్ రిపోర్ట్.  ప్రస్తుతం 40 నుంచి 45 శాతం వరకు సాగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్… వచ్చే ఏడాది 60 నుంచి 65 శాతం వరకు పెరగొచ్చంటున్నారు. సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు వ్యూహాత్మక చర్యలు అనే అంశంపై అసోచాం – ఈవై  సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలింది. క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల మీద జరిగే సైబర్‌ దాడులు గత మూడేళ్లలో ఆరు రెట్లు పెరిగాయి. చాలా జాగ్రత్తగా ఉంటే కానీ వీటి నుంచి బయటపడలేమంటోంది ఈ రిపోర్ట్. సంస్థలు తమ ఆర్థిక, మేధోపరమైన, వినియోగదారుల సమాచారాన్ని పెరుగుతున్న ముప్పుల నుంచి కాపాడుకునేందుకు, నిఘా కోసం లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. సైబర్ నేరాలపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలని తెలిపింది. విదేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపింది. దీన్నే మొదటి ప్రాధాన్యంగా తీసుకుంటూ కేంద్రం ముందుకు అడుగులువేయాలని నివేదిక పేర్కొంది.

No comments:

Post a Comment