మరో అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చేతికి చిక్కింది.
కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్ఓ) డాక్టర్
స్వరాజ్యలక్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ
దాడులు నిర్వహించింది. ఆమె సంపాదించిన అక్రమ ఆస్తులు రూ. 50 కోట్లకుపైనే
ఉంటాయనే ప్రాథమిక అంచనా.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ కేంద్రీయ పరిశోధన సంస్థ (సీఐయూ) బృందం కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఏకకాలంలో బుధవారం ఈ దాడులు నిర్వహించింది. విచారణ అధికారి, ఏసీబీ సీఐయూ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాద్ ఆధర్యంలో ఈ దాడులు కొనసాగాయి.
కర్నూలులోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంతోపాటు, స్వరాజ్యలక్ష్మి అద్దెకు నివాసం ఉంటున్న అపార్టుమెంటులో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంలోని ఓ గృహాన్ని సీజ్ చేశారు.
ఇంకా,
లాకర్లు తనిఖీ చేయాల్సి ఉందని, స్వరాజ్యలక్ష్మిని గురువారం విశాఖ
రప్పించి ఆమె సమక్షంలోనే సీజ్‌చేసిన గృహంతోపాటు లాకర్లు తెరిపించి సోదాలు
నిర్వహిస్తామని విచారణ అధికారి ప్రసాద్ తెలిపారు. లాకర్లు తెరిస్తే
బంగారం, నగదు, ఇంటిస్థలాలు, గృహాలు ఇతర ఆస్తులు ఎంతెంత ఉన్నాయనే దానిపై..
గురువారం స్పష్టత వస్తుందని తెలిపారు.
విశాఖలోనే సుదీర్ఘ కాలం
కాగా, స్వరాజ్యలక్ష్మి గతంలో విశాఖ జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడంతో ఇక్కడే బాగా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 2006 నుంచి 2008 వరకు కేజీహెచ్ ఆర్‌ఎంవోగా స్వరాజ్యలక్ష్మి పనిచేశారు. అనంతరం 2008లో విశాఖ జిల్లా అదనపు డీఎంహెచ్‌వోగా చేరిన ఈమె 2010 అక్టోబర్ వరకు విధులు నిర్వహించారు. 2010 మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా ఇక్కడే పనిచేశారు.
2010 అక్టోబర్‌లో విజయనగరం బదిలీపై వెళ్లి అక్కడ డీఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి విధులు నిర్వహిస్తూనే 2013లో ఇన్‌ఛార్జి ఆర్‌డీగా బాధ్యతలు నిర్వహించారు. ఈమె తీరుపై తొలి నుంచి విమర్శలున్నాయి. ఇక్కడే విధి నిర్వహణలో బాగా ఆర్జించారనే ఆరోపణలు వినిపించాయి.
ఇంఛార్జి ఆర్‌డీగా పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు స్టాఫ్‌నర్సులకు పోస్టింగులు ఇచ్చారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చిన వ్యవహారం ఏసీబీ దృష్టికి అప్పట్లో వెళ్లింది. దీంతో అప్పట్లో విచారణ నిర్వహించారు. కాగా, గతంలో పని చేసిన అధికారులు కూడా అవినీతి ఆరోపణలతో విచారణను ఎదుర్కోవడం గమనార్హం.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ కేంద్రీయ పరిశోధన సంస్థ (సీఐయూ) బృందం కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఏకకాలంలో బుధవారం ఈ దాడులు నిర్వహించింది. విచారణ అధికారి, ఏసీబీ సీఐయూ డీఎస్పీ ఎస్‌వివి ప్రసాద్ ఆధర్యంలో ఈ దాడులు కొనసాగాయి.
కర్నూలులోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంతోపాటు, స్వరాజ్యలక్ష్మి అద్దెకు నివాసం ఉంటున్న అపార్టుమెంటులో సోదాలు నిర్వహించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంలోని ఓ గృహాన్ని సీజ్ చేశారు.
విశాఖలోనే సుదీర్ఘ కాలం
కాగా, స్వరాజ్యలక్ష్మి గతంలో విశాఖ జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడంతో ఇక్కడే బాగా ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. 2006 నుంచి 2008 వరకు కేజీహెచ్ ఆర్‌ఎంవోగా స్వరాజ్యలక్ష్మి పనిచేశారు. అనంతరం 2008లో విశాఖ జిల్లా అదనపు డీఎంహెచ్‌వోగా చేరిన ఈమె 2010 అక్టోబర్ వరకు విధులు నిర్వహించారు. 2010 మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా ఇక్కడే పనిచేశారు.
2010 అక్టోబర్‌లో విజయనగరం బదిలీపై వెళ్లి అక్కడ డీఎంహెచ్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి విధులు నిర్వహిస్తూనే 2013లో ఇన్‌ఛార్జి ఆర్‌డీగా బాధ్యతలు నిర్వహించారు. ఈమె తీరుపై తొలి నుంచి విమర్శలున్నాయి. ఇక్కడే విధి నిర్వహణలో బాగా ఆర్జించారనే ఆరోపణలు వినిపించాయి.
ఇంఛార్జి ఆర్‌డీగా పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు స్టాఫ్‌నర్సులకు పోస్టింగులు ఇచ్చారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చిన వ్యవహారం ఏసీబీ దృష్టికి అప్పట్లో వెళ్లింది. దీంతో అప్పట్లో విచారణ నిర్వహించారు. కాగా, గతంలో పని చేసిన అధికారులు కూడా అవినీతి ఆరోపణలతో విచారణను ఎదుర్కోవడం గమనార్హం.
No comments:
Post a Comment