cricket ad

Sunday, 18 December 2016

ఒక భార్య... 11 మంది భర్తలు... ఇది కథ కాదు జరిగిన ఘటన!

అందంతో వలేస్తుంది. మాటలతో మత్తెకిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం... ప్రేమంటే ఇదేరా అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుందాం రా అని పిలుస్తుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన అరుదైన మోసమిది. నిత్య పెళ్లి కొడుకులను, పెళ్లి కూతుళ్ల గురించి వినే ఉంటారు. అయితే, ఈ యువతి నిత్య పెళ్లి కూతుళ్ల జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్టుంది. అందుకే, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని నిండా ముంచింది. ఈ యువతి బాగోతం గురించి తెలిసిన ఈ 11 మందిలో చివరివాడైన కేరళలోని కొచ్చికి చెందిన లోరెన్ జస్టిన్ తన భార్య మేఘా కనిపించడం లేదని, ఆరోజు నుంచే 15లక్షల డబ్బు, బంగారం కూడా మాయమైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆమె నోయిడాలో పోలీసులకు దొరికిపోయింది.
 
పెళ్లి కాని డబ్బున్న అబ్బాయిల వివరాలను మ్యాట్రిమొనీలో సేకరించి, వారికి తన ఫోటో పంపించేదని విచారణలో తేలింది. డబ్బున్న అబ్బాయిల్లో కూడా ఎవరైతే కొంచెం అందవికారంగా ఉంటారో, విడాకులు తీసుకున్న వారు, అంగ వైకల్యం కలిగి ఉంటారో అలాంటి వారినే ఆమె టార్గెట్ చేసేదని తెలిసింది. ఆమె అందంగా ఉండటంతో తమ అదృష్టం కొద్దీ ఈ అమ్మాయి దొరికిందని భావించి ఆ యువతి గురించి అసలు వివరాలేవీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులు అణకువ కలిగిన భార్యగా నటించి, అన్నీ దోచుకుని వెళ్లిపోవడం ఆమె స్టైల్. ఆ యువతి పేరు మేఘా భార్గవ్. ఇండోర్ ఆమె స్వస్థలం. ఈ ఘరానా మోసాలకు ఆమె చెల్లి, బావ కూడా సహకరిస్తుండటం కొసమెరుపు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు ఈ యువతి మోసానికి బలయ్యారు. సో అమ్మాయి అందంగా ఉందని ముందూవెనుక ఆలోచించకుండా ప్రేమ, పెళ్లి అంటే మొదటికే మోసమొస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులు... బీ అలర్ట్.

No comments:

Post a Comment