cricket ad

Tuesday, 13 December 2016

అక్రమంగా దాచిన కోట్లకు కోట్ల కొత్త 2000 నోట్లను పట్టిస్తున్నవి ఐసోటోప్ లేనా!?

రూ.2వేల నోట్లలో పి32 (పాస్ఫ‌ర‌స్ 32) అనే ఓ రేడియోధార్మిక ఐసోటోప్ పెట్టిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా. అయితే నిజానికి ఈ ఐసోటోప్ అనేది ఓ రేడియో యాక్టివ్ స‌మ్మేళ‌నం. ఇది భూమిపై ప‌లు నిర్దిష్ట‌మైన ప్రాంతాల్లో ఉంటుంది. దీని జీవిత కాలం 14 రోజులు మాత్ర‌మే. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ క‌ణాల‌ను గుర్తించ‌డంలో ఈ ఐసోటోప్‌ను క్యాన్స‌ర్ ప‌రిశోధ‌క యంత్రాల‌లో వాడుతున్నారు. అయితే ఈ ఐసోటోప్‌లో ఉన్న రేడియో ధార్మిక ప‌దార్థం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి హానీ ఉండ‌దు. ఈ క్రమంలో ఈ ఐసోటోప్ ఉన్న ప్రాంతాల‌ను ప‌లు మెషిన్ల ద్వారా ఆటోమేటిక్‌గా గుర్తించ‌డం వీలువుతుంద‌ట‌. అదెలాగంటే… భూమి లోప‌లి పొర‌ల్లో ఎక్క‌డెక్క‌డ ఖ‌నిజాలు ఉన్నాయో శాస్త్రవేత్త‌లు గుర్తిస్తారు క‌దా. అందుకు వారు అధునాత‌న యంత్రాల‌ను వాడుతారు. అలాగే ఈ ఐసోటోప్ ఎక్క‌డెక్క‌డ ఉందో గుర్తించేందుకు కూడా వారి వ‌ద్ద యంత్రాలు ఉంటాయి.
ఈ క్ర‌మంలో ఆర్‌బీఐ ప్రింట్ చేసిన రూ.2వేల నోటులో కూడా పీ32 ఐసోటోప్‌కు చెందిన ప‌దార్థం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలా ఉంటే గ‌న‌క రూ.2వేల నోట్లు ఎక్క‌డ ఎన్ని ఉన్నాయో ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఢిల్లీ, బెంగూళురు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో రూ.2వేల నోట్లు పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి క‌దా. ఐటీ అధికారులు ఇట్టే దాడి చేసి మరీ ఆ నోట్ల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. అయితే ఇదంతా పీ32 ఐసోటోప్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని, అందుకే వారు ఎక్క‌డ పెద్ద ఎత్తున న‌గ‌దు ఉందీ ఇట్టే గుర్తించ‌గ‌లుగుతున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. అయితే దీనిపై ఆర్‌బీఐ కూడా స్పందించింది. అలాంటి ఐసోటోప్‌ను రూ.2వేల నోటులో పెట్ట‌లేద‌ని చెప్పారు. అయినా… ఏమో… ఇది కాక‌పోతే… ఇంకో టోప్… ఏదో ఒక‌టి ఉండే ఉంటుంది..! అని జ‌నాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం జ‌నాలు ప‌డుతున్న క‌ష్టాలేమోగానీ, ఆర్‌బీఐ విడుద‌ల చేసిన కొత్త రూ.2వేల నోటు గురించి రోజుకో కొత్త విష‌యం మ‌న‌కు తెలుస్తోంది. గ‌తంలో ఈ నోట్ల‌లో జీపీఎస్ చిప్ అమ‌ర్చార‌ని వార్త‌లు రాగా, ఆర్‌బీఐ వాటికి క్లారిటీ ఇచ్చింది. అలాంటి చిప్‌లేవీ రూ.2వేల నోట్ల‌లో పెట్ట‌లేద‌ని చెప్పింది. అయితే ఇప్పుడు రూ.2వేల నోటు గురించిన మ‌రో కొత్త విష‌యం జ‌నాల్లో బాగా వ్యాప్తి చెందుతోంది. అదేమిటంటే… ఈ నోట్ల‌లో రేడియోధార్మిక పాస్ఫ‌ర‌స్ ఐసోటోప్ పెట్టార‌ని తెలిసింది. ఇదే వార్త ఇప్పుడు ఎక్క‌డ చూసినా పెద్ద ఎత్తున విన‌బ‌డుతోంది. అయితే ఇంత‌కీ ఈ ఐసోటోప్ సంగ‌తేమిటి..? ఒక‌సారి చూద్దాం…

No comments:

Post a Comment