cricket ad

Sunday, 18 December 2016

వడ్డీవ్యాపారం, మనీ లాండరింగ్ తో 400కోట్లు కూడబెట్టిన చాయ్ వాలా -

రద్దైన పెద్ద నోట్ల డిపాజిట్ గడువు దగ్గరపడేకొద్దీ ఐటీ అధికారులు స్పీడు పెంచారు. దేశవ్యాప్తంగా నల్ల కట్టలు మింగిన వారి బండారం బయటపెడుతున్నారు. రోజూ వందల కోట్ల నగదు, బంగారం, ఆస్తులు సీజ్‌చేస్తున్నారు. చెన్నైలో దాదాపు 200 కోట్ల నగదు, బంగారంతో శేఖర్ రెడ్డి ఐటీ అధికారులకే షాక్ ఇవ్వగా.. అంతకు మించి చుక్కలు చూపించాడు ఓ గుజరాతీ. ఏకంగా 400 కోట్ల ఆస్తులతో ఐటీ శాఖే బిత్తరపోయేలా చేశాడు. బ్లాక్‌మనీ అంటే ఏ బిజినెస్ మేనో, ప్రభుత్వ అధికారో లేదంటే ఏ కోటీశ్వరుడో వెనకేస్తాడు. కానీ ఒక  సాధారణ చాయ్ వాలా ఏకంగా 400 కోట్లు కూడబెట్టి ఐటీ అధికారులకు అదిరిపోయే షాకిచ్చాడు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత అక్రమార్కుల కోట్ల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అందర్నీ మించిపోయిన కిషోర్ భజియావాలా అనే వ్యక్తిని ఐటీ అధికారులు సూరత్‌లో అదుపులోకి తీసుకున్నారు. భజియావాలా అంటే బజ్జీలు అమ్మే వ్యక్తి. చాయ్, బజ్జీలు అమ్ముతూ జీవితం ప్రారంభించిన కిషోర్..  తర్వాత ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారం, మనీ లాండరింగ్ చేసి బాగా కూడబెట్టాడు. తర్వాత రాజకీయ నేతల అండతో అప్పులు  తీసుకున్న వారిని బెదిరించి వారి ఆస్తులును స్వాధీనం చేసుకుని కోట్లకు పడగెత్తాడు. అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో అధికారులు 150 కోట్ల ఆస్తులు సీజ్ చేసారు. కోటీ 33 లక్షల నగదు, 7 కోట్ల విలువైన బంగారం, 70 లక్షల విలువైన వెండి కూడా పట్టుబడింది. భజియావాలా ఇంట్లో పట్టుబడ్డ వాటిలో 95 లక్షల విలువైన కొత్త 2 వేల నోట్లున్నాయి. ఈ మొత్తం ఆస్తులు,  నగదు విలువ సూమారు 400 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత రోజే.. సూరత్ లోని ఒక  బ్యాంకుకు భజియావాలా భారీ సంచులతో రావడం సీసీటీవీలో చూసి అతడిపై నిఘా పెట్టారు అధికారులు. విచారణలో సరైన సమాధానం చెప్పకపోవడంతో సూరత్ లోని అతడి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బినామీ పేర్లతో వివిధ బ్యాంకుల్లో 30 అకౌంట్లు, 16 లాకర్లు గుర్తించి సీజ్ చేశారు. 
- See more at: http://www.tv5news.in/newsdetails.aspx?ID=63419&SID=79&Title=IT-Seizes-Rs-400-Crores-from-Tea-Seller-Turned-Financier-in-Surat#sthash.xf0sKBpI.dpuf

No comments:

Post a Comment