డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ మరోసారి అకాడమీ అవార్డుల బరిలో
నిలిచాడు. బ్రెజిల్ ఫేమస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే బయోపిక్ తో
మరోసారి ఆస్కార్ అందుకునే ఛాన్స్ కొట్టేశాడు. సంపాదించాడు. వచ్చే ఏడాది
ఫిబ్రవరిలో ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఫేమస్ సంగీత దర్శకులతో
పోటీపడుతున్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి 2009లో రెండు ఆస్కార్
అవార్డులు అందుకున్నాడు ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రహమాన్.
అభిమానులకు డబుల్ జోష్ ఇచ్చాడు. వచ్చే ఏడాది జరగబోయే అకాడమీ అవార్డుల
ప్రదానోత్సవంలో మరోసారి ఆస్కార్ అందుకునేందుకు పోటీపడుతున్నాడు. బ్రెజిల్
ఫుట్ బాల్ ఆటగాడు పీలే బయోపిక్ పీలే.. బర్త్ ఆఫ్ ఎ లెజెండ్ మూవీకి
ఒరిజినల్ స్కోర్ విభాగంలో పోటీపడుతున్నాడు. ఫిబ్రవరి 26న జరిగే 89వ ఆకాడమీ
అవార్డులకు ఒరిజనల్ స్కోర్ విభాగంలో ఈసారీ 145 మంది పోటీ పడుతున్నారు.
వీటిలో ఒకటిగా నిలిచింది పీలేలోని రెహమాన్ కంపోజ్ చేసిన గింగా. జెఫ్
జింబాలిస్ట్, మైకెల్ జింబాలిస్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆస్కార్
అవార్డుల నామినేషన్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల
చేయనున్నారు. 2009లో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న రహమాన్ కు 2011లో
127 అవర్స్ ఒరిజినల్ స్కోర్, ఇఫ్ ఐ రైజ్' అనే పాటకు నామినేట్ అయ్యారు.
2014లో కూడా మిలియన్ డాలర్ ఆమ్, ద హండ్రెడ్ ఫుట్ జర్నీ, ఇండియన్ మూవీ
కొచ్చాడయాన్‌కు ఆస్కార్ బరిలో నిలిచారు. కానీ అవార్డు అందుకోలేకపోయారు.
కానీ ఈసారీ మాత్రం రహమాన్ కు మరో ఆస్కార్ గ్యారంటీ అని నమ్మకంగా ఉన్నారు
అభిమానులు.
No comments:
Post a Comment