cricket ad

Tuesday, 13 December 2016

మీకు కోటి రూపాయలు కావాలా? అయితే ఇలా చేయండి..

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి నీతి ఆయోగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులకు భారీ పారితోషికాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పది ప్రమోటర్ బ్యాంకులను ఎంపిక చేసింది.
దేశాన్ని డిజిటల్ వైపు నడిపించడానికి నీతి ఆయోగ్ సరికొత్త పథకంతో ప్రజల ముందుకు వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లను ప్రోత్సహించడానికి కోటి రూపాయల స్కీమ్ ను తెరపైకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు కొనసాగించే వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసి మూడు నెలలకోసారి కోటి రూపాయలు అందించనుంది. ప్రతి వారానికోసారి లక్కీ డ్రా లో గెలుపొందిన వినియోగదారులు, వ్యాపారస్థులకు పదిలక్షల రూపాయల పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను నిర్వహించే బాధ్యతను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పజెప్పింది ప్రభుత్వం.
ఈ స్కీమ్ ను సమర్ధవంతంగా అమలుచేయడానికి 10 ప్రమోటర్ బ్యాంకులు ఉన్నాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, సిటీబ్యాంక్, హెచ్ ఎస్ బీసీ లు ఈ లిస్ట్ లో ఉన్నాయి.
నీతి ఆయోగ్ స్కీంను ప్రధానంగా గ్రామాలు, పట్టణ నిరుపేద, మధ్య తరగతి వర్గాలే లక్ష్యంగా కొనసాగించనున్నట్టు తెలిపింది ఎన్పీసీఐ. డిజిటల్ పేమెంట్స్ చేసిన వారి ట్రాన్సాక్షన్ ఐడీలలో మూడు నెలలకోసారి ఓ లక్కీ విజేతను ఎంపిక చేసి కోటి రూపాయల బహుమతి అందించనున్నారు. డిజిటల్ పేమెంట్స్వైపు ఆకర్షించేలా ఈ స్కీం రూపొందించారు. ప్రతివారం పది మంది కస్టమర్లు, పది మంది వ్యాపారస్తులను విజేతలుగా ప్రకటిస్తారు. యూఎస్ ఎస్ డీ, ఏఈపీఎస్, యూపీఐ, రూపే కార్డులు ఉపయోగించే వాళ్లంతా ఈ పథకానికి అర్హులు. పీవోఎస్ మెషిన్లు వాడుతున్నవాళ్లనూ పరిగణలోకి తీసుకోవాలా వద్దా అని పరిశీలిస్తున్నారు.

No comments:

Post a Comment