పది
మంది మాట్లాడుకొనే అంశాలపై సినిమా తీయడంలో రామ్‌గోపాల్ వర్మ ముందుంటారు.
అందుకే ఆయన ఎక్కువగా వార్తల్లో విషయాల్నే లక్ష్యంగా చేసుకొంటుంటారు.
ఆ తరహా సినిమాలు తీస్తున్నప్పుడు ప్రేక్షకుల చూపంతా అటువైపే ఉంటుంది.
తెలిసిన విషయమే అయినా... ఏం చూపించారో, ఎలా చూపించారో అనే ఓ ఆసక్తి,
ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది. రామ్‌గోపాల్ వర్మకి కావల్సింది
కూడా అదే. అందుకే సమాజంలో ఏం జరిగినా, ఎలాంటి సంచలనం చోటు చేసుకొన్నా
వెంటనే అటువైపు ఓ కన్నేస్తుంటారు. ఇటీవలే ‘నయీమ్’ చిత్రాన్ని సెట్స్‌పైకి
తీసుకెళ్లిన ఆయన తదుపరి ‘శశికళ’ పేరుతోనూ ఓ సినిమాని తెరకెక్కించనున్నట్టు
ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె
నెచ్చెలి శశికళ పేరు ప్రముఖంగా వినిపించింది. వాళ్లిద్దరి స్నేహబంధం గురించి
జాతీయస్థాయిలో ప్రచారం సాగింది. అదే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మని
ఆకట్టుకుంది. అయితే వర్మ మాత్రం తాను తెరకెక్కించే కథ పూర్తిగా కల్పితమనీ,
ఓ రాజకీయ వేత్తకి ప్రియమైన స్నేహితురాలి కథే అయినా, ఇది రాజకీయ
నేపథ్యంతో కూడుకొన్నది మాత్రం కాదని స్పష్టం చేశారు. జయలలిత అంటే
తనకి ఎంతో ఇష్టమని, అయితే శశికళ అంటే ఆమెకన్నా ఎక్కువ గౌరవమని ఈ
సందర్భంగా ట్వీట్ చేశారు వర్మ. ‘‘జయలలిత అందరికంటే ఎక్కువగా
శశికళని గౌరవించేవారనే విషయమే తన చిత్రానికి ‘శశికళ’ పేరు
పెట్టడానికి కారణం. జయలలిత కళ్లతో జయలలితని చూడటం కంటే...
శశికళ కళ్లతో జయలలితని చూడటం మరింత కవితాత్మకంగా ఉంటుంద’’ని
ట్వీటారు వర్మ.
No comments:
Post a Comment