cricket ad

Thursday, 15 December 2016

ప‌విత్ర‌మైన దేవాదాయ శాఖ‌లో ఉద్యోగిగా

ప‌విత్ర‌మైన దేవాదాయ శాఖ‌లో ఉద్యోగిగా ఆ అధికారి ఉన్నాడు. బుద్దిగా ఉండాల్సిన అతడు పెద్ద కామాంధుడిగా మారిపోయాడు. తను చేసే రాస‌ల‌లీల‌కు గుడి ఆవ‌ర‌ణ‌నే అడ్డాగా మార్చుకున్నాడు. తినడానికి తిండిలేక పాకులాడుతున్న కొంతమందికి మాయ మాటలు చెప్పి వారిని త‌న రాస‌లీల‌ల‌కు వాడుకుంటున్నాడు.
తనతో రాస‌ల‌లీల‌కు ఒప్పుకుంటే వారి..బంధువులు, కుటుంబ సభ్యులకు గుడిలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అంజ‌య్య‌ ఆలయ గెస్ట్‌హౌజ్‌లలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అంజయ్య చేసే రాసలీలల ఫొటోలు మీడియాకు సైతం చిక్కాయి. వాటిలో కొన్ని ఆలయ బుకింగ్‌ కార్యాలయం, గెస్ట్‌హౌజ్‌ వెనక భాగంలో దిగినవి కాగా, మరికొన్ని వాహనం, గదుల్లో సాగించిన లీలలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అంజయ్య గతంలో వేద పండితుడిపై చేయి చేసుకున్న సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఎన్నో ఆరోపణలతో చాలా సార్లు మల్లన్న ఆలయం నుంచి బదిలీ అయ్యాడు. అయినా, కొద్ది సమయంలోనే తిరిగి కొమురెల్లికి వచ్చేస్తూ ఇక్క‌డ రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నాడు. గుడిలో పని చేసే వారు.. మద్యం, జూదం, కామం వంటి వ్యసనాలకు లోనుకాకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ.. వాటిని మరిచిపోయి  ఏఈవో వైరాగ్యం అంజయ్య పలు సందర్భాల్లో గెస్ట్‌హౌజ్‌లలోనే మద్యం సేవిస్తూ లీలలు సాగిస్తున్నాడు. మరి అంజ‌య్య‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Related

No comments:

Post a Comment