ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థపై వస్తున్న విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా నోట్ల రద్దును సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఇక నుంచి ప్రజలకు నోట్లతో పనిలేదని, డబ్బుల కోసం ఏటీఎంల ఎదుట క్యూకట్టాల్సిన పనిలేదన్నారు. జేబులోని మొబైల్ ఫోనే ఇక నుంచి బ్యాంకు బ్రాంచి అని అన్నారు. దేశంలోని చాలామందికి మొబైల్ బ్యాంకింగ్ గురించి తెలియదన్న విమర్శలపై మోదీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ప్రజలు హర్షధ్వానాలు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నారని, అభ్యర్థి పేరు చదివి ఓట్లు వేస్తున్నారని గుర్తు చేశారు. కానీ భారత్‌లో మాత్రం ఏవీఎంల మీట నొక్కి ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏమీ తెలియదనుకోవడం పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌ను కూడా వారు సమర్థంగా చేయగలరని అన్నారు.
చంఢీగడ్‌లో జరిగిన సంగీత్‌లో యువీ దంపతులతో కలిసి ఈ ఇద్దరూ డ్యాన్స్ కూడా చేశారు. అక్కణ్నుంచి అనుష్క, కోహ్లీ గోవా పయనమయ్యారు. గోవాలో యువీ పెళ్లికి కూడా హాజరై అభినందనలు తెలిపారు. పనిలో పనిగా తమకు ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన బాలీవుడ్ గీత రచయిత జావెద్ అఖ్తర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కణ్నుంచి తమ ప్రేమ కబర్లు చెప్పుకుంటూ పయనమయ్యారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమికులనే విషయం తెలిసిందే. ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోనప్పటికీ, భార్యాభర్తల్లాగానే ఉంటారు. ఏ ఈవెంట్‌కైనా కలిసే హాజరవుతుంటారు. కాగా, ఇటీవల జరిగిన టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వివాహ సమయంలో ఈ జంట బాగా ఎంజాయ్ చేసిందట.
No comments:
Post a Comment