cricket ad

Sunday, 11 December 2016

ప్రకంపనలు పుట్టిస్తున్న ఐటి దాడులు...తాజాగా రూ.13 కోట్లు స్వాధీనం

: నల్లధనంపై ఐటీ దాడుల పరంపర కొనసాగుతోంది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1 ఏరియాలోని ఓ న్యాయ సంస్థపై ఆదాయం పన్ను అధికారులు, ఢిల్లీ పోలీసులు జరిపిన సోదాల్లో రూ.13 కోట్ల నగదు పట్టుబడింది. వీటిలో రూ.2.5 కోట్ల కొత్త కరెన్సీ కట్టలు ఉన్నాయి. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిపామని, కప్‌బోర్డు, సూట్‌కేసులో దాచి ఉంచిన రూ.13.56 కోట్ల రూపాయలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. క్రైం బ్రాంచ్ పోలీసులు టి అండ్ టి సంస్థపై ఈ దాడులు నిర్వహించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఐటి దాడుల్లో పట్టుబడిన మొత్తంలో 7 కోట్లు విలువచేసే పాత రూ.1000 నోట్లు, 3 కోట్లు విలువచేసే రూ.100 నోట్లు, తక్కినవి పాత, కొత్త నోట్లుగా వివిధ డినామినేషన్లలో ఉన్నాయని చెప్పారు. పోలీసు బృందం రైడ్స్ జరిపిన సమయంలో టి అండ్ టి సంస్థ గదులు చాలామటుకు తాళం వేసి ఉండగా, ఒక కేర్‌టేకర్ మాత్రం అక్కడ ఉన్నాడు. రోహిత్ టాండన్ అనే వ్యక్తి టి అండ్ టి న్యాయసంస్థ ప్రమోటర్‌‌గా ఉన్నారు.

No comments:

Post a Comment