తమిళనాడు ముఖ్యమంత్రి జయ
లలిత మరణం, తదనంతర పరిణా మాలపై వెలుగుచూస్తున్న విషయాలు ఆమె అభిమానులను
కలవరానికి గురిచేస్తున్నాయి. 2012లో తెహెల్కా ప్రచురించిన సంచలన కథనం
జయలలిత మృతి వెనుక కుట్ర జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చుతోంది. దీంతో
ప్రజల్లో జయ సన్నిహితురాలు శశికళపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకుని శశికళ అనేక అక్రమాలకు
పాల్పడ్డారనీ, సీఎం జయలలితను చంపేందుకు సైతం కుట్రపన్నారనీ తెహెల్కా
నాలుగేళ్ల ముందే కథనం రాసింది. జయ నివాసం పోయెస్ గార్డెన్స్ నుంచి శశికళను
వెళ్లగొట్టిన తర్వాత... శశికళ తాను నియమించిన నర్సు ద్వారా సీఎంకు
స్లోపాయిజన్ ఎక్కించినట్టు పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై
చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడయినట్టు తెహెల్కా
తెలిపింది. ఆమెకు నిద్రమాత్రలు, రసాయనాల రూపంలో కొద్ది కొద్దిగా విషం
ఎక్కిస్తున్నట్టు వైద్యపరీక్షల ద్వారా బయటికి వచ్చినట్టు పేర్కొంది. శశికళ
నియమించిన నర్సు సీఎంకి ఇచ్చే మందులు, పళ్లు వగైరా ఆహార పదార్థాల్లో వాటిని
కలిపి ఇచ్చినట్టు తెలిపింది. కాగా జయలలిత నుంచి అధికారాన్ని
చేజిక్కించుకునేందుకు... శశికళను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు
మన్నార్‌గుడి మాఫియా (శశికళ కుటుంబం) చేసిన పలు ప్రయత్నాలను కూడా
ఉటంకించింది. శశికళ భర్త నటరాజన్, ఆమె సోదరుడు దివాహారన్, మరదలు ఇళవరసి,
కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మహదేవన్, మేనకోడలి
భర్త శివకుమార్ తదితరులు ఒకప్పుడు జయ నివాసంలోనే ఉండేవారు. జయతో శశికళకున్న
స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వారు అనేక అక్రమాలకు పాల్పడినట్టు
వెలుగుచూడడంతో సీఎం వారిని తన ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఎలాగైనా
జయలలితను అంతమొందించాలనే ఉద్దేశంతో ఆమెను మళ్లీ మచ్చిక చేసుకుని ఇంట్లోనే
జయపై శశికళ కుట్ర సాగించినట్టు తెహెల్కా పేర్కొంది. సీఎం మరణానంతరం తాజాగా
శశికళ కుటుంబం మళ్లీ జయ ఇంట్లో పాగా వేయడంతో... మళ్లీ చక్రం తిప్పేందుకే
రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 22 జయ అపోలో
ఆస్పత్రిలో చేరింది మొదలు... ఆమె చికిత్స గురించి కాదుగదా, కనీసం ఆమెను
కలిసేందుకు కూడా ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఆస్పత్రిలో చేర్పించిన నాటి నుంచి
అంతిమ సంస్కారాల వరకు శశికళ అన్నీ తానై వ్యవహరించడం కూడా గమనార్హం
No comments:
Post a Comment