తమిళనాడు ముఖ్యమంత్రి
జయలలిత గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి ప్రకటించిన వివరాల
ప్రకారం ఆమె కన్నుమూసింది డిసెంబర్ 5న. కానీ ఆమె ఒకరోజు ముందే చనిపోయిందని
తెలుస్తోంది. డిసెంబర్ 4న, ఆదివారమే ఆమె కన్నుమూసినట్లు సమాచారం.
అన్నాడీఎంకే నేతలు ఆదివారం సాయంత్రం నుంచే అంత్యక్రియలకు ఏర్పాట్లు
మొదలుపెట్టారు. ఆమె పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్‌ను కూడా శుభ్రం
చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీంతో పార్టీ కీలక నేతలకు ఆమె
చనిపోయిందన్న విషయం తెలిసుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపోలో
ఆసుపత్రి యాజమాన్యం కూడా అధికార పార్టీ నేతల ఆదేశాల ప్రకారమే సోమవారం
అర్థరాత్రి ప్రకటన చేసినట్లు సమాచారం. ఆమె ఆదివారమే చనిపోతే సోమవారం
అర్థరాత్రి వరకూ ఎందుకు గోప్యంగా ఉంచారనేది అంతుచిక్కని ప్రశ్న. ఆ
ఒక్కరోజులో ఏం జరిగిందనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
No comments:
Post a Comment