తమిళనాడు
ముఖ్యమంత్రి జయలలిత డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం
విదితమే. అయితే, ఆమె మరణానంతరం ప్రజల్లో ఎన్నో సందేహాలు, మరెన్నో అంతు
చిక్కని ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. జయలలితది సహజ మరణం కాదనే వాదనలు
వినిపిస్తున్నాయి. జయలలిత అక్కున చేర్చుకుని, సొంత మనిషి కంటే ఎక్కువగా
నమ్మిన శశికళే జయలలిత హత్యకు కుట్రపన్నిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆసుపత్రిలో చికిత్స జరిగిన 75రోజులు సొంత మనుషులను కూడా ఆసుపత్రిలోకి
రానివ్వకుండా, శశికళే అన్నీ తానై వ్యవహరించింది. దీంతో ఈ అనుమానాలు మరింత
బలపడుతున్నాయి.
జయలలిత చిన్న చెల్లి కూతురు అమృత
బెంగళూరులో ఉంటోంది. తమ ఆంటీతో మాట్లాడనివ్వకుండా శశికళ కుట్రపూరితంగా
వ్యవహరించేదని అమృత చెప్పింది. జయలలిత ఆసుపత్రిలో ఉండగా చూడటానికి 3 సార్లు
వెళ్లానని, ఒక్కసారి కూడా శశికళ తనను లోపలికి అనుమతించలేదని ఆమె ఆవేదన
వ్యక్తం చేసింది. జయలలిత ఆస్తిని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి తమిళనాడు
ప్రజలకు దక్కేలా చూడాలని, అప్పుడే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుందని అమృత
భావించింది. జయలలిత ఆస్తి దక్కించుకోవాలని శశికళ కుట్ర పన్నిందని అమృత
సంచలన ఆరోపణలు చేశారు.
No comments:
Post a Comment