cricket ad

Sunday, 11 December 2016

రేపు ‘‘మిలాద్‌ - ఉన్‌ - నబీ’’ అంటే ఏంటో తెలుసా?

అనంత కరుణామయు డు అల్లాహ్‌ సర్వమానవాళి శ్రేయస్సు కోసం,శాంతిని నెలకొల్పేందుకు ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నుకున్న అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌ ద్వారా తెలపబడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్‌ (సఅస) కేవలం ముస్లిం కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని తెలపబడింది. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్‌ ద్వారా ఏది వినునో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేకదైవ గ్రంథాల్లో ముందుగానే తెలపబడిఉన్నది. మరో సాక్ష్యం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త (ఉమ్మి) అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్‌ తహ లా మహిమ పవిత్ర ఖురాన్‌ను దైవవాణి రూపంలో ప్రవక్తపై అవతరింప జేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు అయ్యాయి.
 
అల్లాహ్‌కు అతి ప్రీతి పాత్రులైన మహమ్మద్‌ (సఅస) ఇస్లాం క్యాలెండర్‌లోని మూడో నెల రబీవుల్‌ అవ్వల్‌ 12వ తేదీ సోమవారం హిం దువుల క్యాలెండర్‌ విక్రమాదిత్య శకం 628 జ్వేష్టశుద్ధ 9వ తేదీ సోమవారం, 570 సంవత్సరం ఏప్రిల్‌ 20వ తేదీ గ్రీగోరియన్‌ క్యాలెండర్‌ (క్రిస్టియన్‌) ప్రకారం జన్మించారని తెలపబడి ఉంది మక్కాపురం పెద్ద అయిన అబ్దు ల్‌ మత్తలబు కుమారుడు అబుద్దాలా అమీనాలకు జన్మించారు. మహమ్మద్‌ (ప్రవక్త) సోమవారం సూర్యోదయానికి వేకువజామున మధ్య జన్మించినట్లు తెలపబడింది. మహమ్మద్‌(సఅస)కు 40వ ఏట ప్రవక్త పదవి వరిం చిందని తెలపబడింది. వారు ఏకదైవారాధన, మానవులంతా ఒక్కటే, తారతమ్యాలు అనేవి లేవని అంతా అల్లాహ్‌ దాసులేననిప్రబోధించే వారు. శాంతి సహజీవనం, దానం, దైవ భీతి తో మెలగాలని బోధించేవారు. ప్రపంచ మంతటా ఆయనపుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. ఆయన జయంతి వేడుకలను ‘‘మిలాద్‌ - ఉన్‌ - నబీ’’ అని అరబ్బీలో అంటారు.
 
భారత దేశంలో...
భారత దేశంలో మిలాద్‌ - ఉన్‌ - నబీ 12వ తేదీ సోమవారం రానుంది. ఈ సందర్భంగా దేశమంతటా ఆధ్యాత్మిక సభలు నిర్వహించి ప్రవక్త జీవిత విశేషాలను, ఆయన బోధనల ను మత గురువులు ప్రజలకు వివరిస్తారు.
 
కడప జిల్లాలో ....
మిలాద్‌ - ఉన్‌ - నబీ కడప జిల్లాలో బార్మినెలగా బహుప్రసిద్ధి, ప్రవక్త జన్మదిన వేడుక ల సందర్భంగా రాత్రిళ్ళు ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్‌ (ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు. వేకువ జామున నమాజ్‌ తర్వాత బార్మి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన జిల్లాలో ముస్లింలతో పాటు హిందూ సోదరులు కూడా ఎంతో పవిత్రంగా బార్మి అన్నదానాలు నిర్వహించడం ప్రత్యేకత. ఇది మత సామరస్యానికి నిదర్శనం. ఐకమత్యానికి జిల్లా అందరికీ ఆదర్శం అనడం అతిశయోక్తి కాదు.

No comments:

Post a Comment