cricket ad

Saturday, 10 December 2016

సోషల్ మీడియా వేదికగా శశికళ మేనల్లుడు పెడుతున్న పోస్టులివి!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన నేటికి ఐదురోజులైంది. ఈ ఐదు రోజుల నుంచి ఆమె మృతిపై అనేక సందేహాలు, ఊహాగానాలు. ఆమెను ఉద్దేశపూరితంగా హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు ప్రజలు ఒకడుగు ముందుకేసి సోషల్ మీడియా వేదికగా శశికళను జయ మృతికి ప్రధాన కుట్రధారిగా పేర్కొంటున్నారు. అయితే అన్నాడీఎంకే మాత్రం శశికళ చాలా ముఖ్యమైన వ్యక్తి అని, జయ విషయంలో అలా చేయదని సమర్థిస్తోంది. శశికళ పాత్రపై అనుమానాలున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆమె మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి తెరలేపారు.
 
శశికళ మేనల్లుడు జియానంద్ దివాకరన్ తన ఫేస్‌బుక్ పేజ్ వేదికగా శశికళ గురించి ప్రచారం చేస్తున్నాడు. శశికళ కుటుంబం జయ కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అండగా నిలిచిందని జియానంద్ పోస్ట్ చేశాడు. జయలలితను మూడు సార్లు ప్రాణాపాయం నుంచి శశికళ సోదరుడు కాపాడాడని ఓ ఫోటో పోస్ట్ చేశాడు. జయలలిత ప్రతిపక్షంలో ఉండగా ఆమెపై లాఠీ చార్జి జరగకుండా ఉండేందకు శశికళ సోదరుడు దివాకరన్ లాఠీ దెబ్బలకు ఎదురునిలిచాడని పోస్ట్ చేశాడు. ఆ లాఠీచార్జ్‌లో దివాకరన్‌కు 14 చోట్ల గాయాలయ్యాయని పోస్ట్ చేశాడు.

No comments:

Post a Comment