cricket ad

Saturday 10 December 2016

భారతీయుల వీసా ఆశలపై ట్రంప్ నీళ్ళు

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపునే ఆయన మాటలు భారతీయులకు దడపుట్టిస్తున్నాయి. ప్రతిభావంతులైన భారతీయులు అమెరికాలో గొప్ప అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివారి ఆశలపై ట్రంప్ నీళ్ళు జల్లుతున్నారు. అయోవాలో తన మద్దతుదార్లతో ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను తీసుకోవడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


 డిస్నీ వరల్డ్, తదితర అమెరికా కంపెనీల్లో పరిస్థితులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అమెరికా ప్రజల్లో చిట్టచివరి వ్యక్తి జీవితాన్ని కూడా కాపాడేందుకు పోరాడాలని ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో తాను ఉద్యోగాలు కోల్పోయిన అనేకమంది అమెరికన్ వర్కర్లతో మాట్లాడానని చెప్పారు. వారికి బదులుగా తీసుకొచ్చిన విదేశీ వర్కర్లకు ఉద్యోగాలు కోల్పోయినవారిచేత బలవంతంగా శిక్షణ ఇప్పిస్తున్నారని చెప్పారు. 




‘‘మీకు బదులుగా వచ్చినవాళ్ళకు శిక్షణ ఇవ్వకపోతే మీ జీతం బాకీలు మీకు చెల్లించడం లేదు’’ అన్నారు. ఇటువంటి సంఘటనలను ఇకపై జరగనిచ్చేది లేదన్నారు. ట్రంప్ మాటలకు వేలాది మంది హర్షం వ్యక్తం చేశారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలోకి వచ్చిపడుతున్న మాదక ద్రవ్యాలు అమెరికా యువతను పాడుచేస్తున్నాయని, వాటిని అరికడతానని శపథం చేశారు.

No comments:

Post a Comment