cricket ad

Saturday 10 December 2016

అన్నీ తెలిసినా ‘అమ్మ’ ఎందుకు ఊరుకుందంటే..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో మన్నార్‌గుడి మాఫియా రహస్య సమావేశం నిర్వహించినట్టు 2012లో తెహల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ బయట పెట్టారు. కుట్రలపై పోలీసులు సమగ్ర నివేదిక ఇచ్చినప్పటికీ శశికళ కుటుంబంపై జయలలిత చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలనూ వివరించారు. జీమన్ కథనం ప్రకారం... శశికళ, ఆమె భర్త నటరాజన్, రావణన్ (శశికళ పినతండ్రి అల్లుడు) సహా ‘మన్నార్‌గుడి మాఫియా’లో మరో నలుగురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైనట్టు నాటి డీజీపీ రామానుజం దృష్టికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో జయలలితకు ఎదురయ్యే సమస్యలు, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి అనే దానిపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది. దీనిపై కర్నాటక డీజీపీ అప్పటి తమిళనాడు డీజీపీకి టేపులతో సహా సమాచారం ఇచ్చారు. ఈ టేపులను మొత్తం విన్న తర్వాత సీఎం జయలలిత వెంటనే స్పందించకుండా కొన్నిరోజులు అలాగే గడవనిచ్చారు. మరోవైపు డీజీపీ రామానుజం దీనిపై పకడ్బందీ ఆపరేషన్‌తో పక్కా ఆధారాలు సేకరించారు. ‘మన్నార్గుడి మాఫియా’పై పూర్తి నిఘావేయడంతో పాటు ఓ ప్రయివేటు డిటెక్టివ్ ఏజెన్సీనికి కూడా బాధ్యతలు అప్పగించారు. శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ సంభాషణలు  సేకరించి నేరుగా ముఖ్యమంత్రి జయలలితకు చేరవేశారు. ఈ వ్యవహారం మొత్తం తన దృష్టికి వచ్చినప్పటికీ... వారిపై చర్యలు తీసుకుంటే పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని జయలలిత భావించారు. దీంతో శశికళతో సన్నిహితంగా మెలుగుతున్న అధికారులను, మన్నార్గుడి మాఫియాకి సహకరిస్తున్న వారిని నెమ్మదిగా పక్కకు తొలిగించారు. తనకు పదేళ్లుగా వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్న తిరుమలై స్వామిని సైతం సాగనంపారు. క్రమంగా మంత్రివర్గాన్ని శశికళ వ్యవహారంపై అప్రమత్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ జయను ఏదోవిధంగా మచ్చిక చేసుకుని శశికళ తన వ్యవహారం చక్కబెట్టుకున్నట్టు జీమన్ వివరించారు.

No comments:

Post a Comment