అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్… అమెరికన్ ఉద్యోగుల
స్థానంలో హెచ్1బి వీసాలతో వచ్చిన విదేశీయులు పనిచేయడానికి తాను ఏమాత్రం
అనుమతించేది లేదని చెప్పారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న
నినాదంతో విధానాలను స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా
తాను కొంతమంది అమెరికన్లను కలిసినప్పుడు… తమ ఉద్యోగాలు పీకేశారని, తమ
స్థానంలో విదేశీయులను నియమించుకుంటున్నారని వాళ్లు చెప్పారని ట్రంప్
అన్నారు. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని
వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు.
No comments:
Post a Comment